ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇద్దరు గత కొన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ రహస్యంగా కరోనా సమయంలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. వివాహం ఎప్పుడు చేసుకోబోతున్నారు అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయితే జూన్ 9వ తేదీన చిత్తూరు జిల్లా తిరుపతిలో  తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఒక్కటి కాబోతున్నారు. ఇకపోతే తాజాగా విగ్నేష్ శివన్ నయనతార పై చూపించిన ప్రేమను తట్టుకోలేకపోతోంది అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల తన ప్రేయసి కోసం నచ్చినవన్నీ ఆర్డర్ చేసి ప్రేమగా, గోముగా దగ్గర కూర్చుని మరీ తినిపిస్తూ ఉంటే ఆ రొమాంటిక్ ఫీలింగే వేరు అని చెప్పవచ్చు. ఇక ఇదిగో ఈ సన్నివేశం ఇక్కడ మనం చూడవచ్చు. ఇక అందాల తార నయనతార కోసం ప్రియసఖుడు విగ్నేష్ శివన్ ఏకంగా కొన్ని రకాల నాన్ వెజ్ వెరైటీలను ఆర్డర్ చేసాడు. అంతే కాదు వాటిని ప్రేమగా ఆమెకు తినిపిస్తున్నాడు. ఇక ఆ సమయంలో నయనతార ఎంతో సిగ్గుపడుతూ కనిపించడం మనం చూడవచ్చు. ఎరుపెక్కిన బుగ్గల్లో సిగ్గంతా బహిర్గతమవుతుంది. ఇక నేటి రోజుల్లో ఇలాంటి అన్యోన్యత చాలా అరుదుగా మనం చూడవచ్చు ముఖ్యంగా బిజీ లైఫ్ లో చాలామంది ఇలాంటివి మిస్ అవుతూ ఉన్నారు. అందుకే అలాంటి జంటలకు ఈ జంట స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు.

ఇంతకూ ఆహారాన్ని ఎక్కడి నుంచి ఆర్డర్ చేశారు అనే విషయానికి వస్తే మహాబలిపురంలో ఉన్న ఒక స్థానిక రెస్టారెంట్ నుంచి నాన్ వెజిటేరియన్ ఆహారాన్ని విఘ్నేష్ శివన్ ఆర్డర్ చేశాడు. ఇక ప్రియుడు చెంతనే ఉండి ప్రేమగా తినిపిస్తూ ఉంటే నయనతారకు చాలా సంతోషంగా అనిపిస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఇలాంటి అరుదైన అవకాశం తనకు దక్కినందుకు  విఘ్నేష్ శివన్ చాలా సంతోషిస్తున్నారు. ఇకపోతే వివాహం అనంతరం ఈ జంట ఇలాగే అన్యోన్యంగా ఉంటారో లేదో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: