టాలీవుడ్ హాట్ హీరోయిన్ పూర్ణ అవకాశాల్లేక, ఎప్పుడో ఫేడ్-అవుట్ అయ్యింది. ఐతే, హీరోయిన్ గా ఆమెకు అవకాశాలు అనేవి రాకపోయినా.. సైడ్ క్యారెక్టర్స్ తో ఆమె సర్దుకు పోతుంది.పైగా ఇప్పటికే ఆమె తన పారితోషికాన్ని కూడా అమాంతం తగ్గించేసింది. తాజాగా, తన రెమ్యునరేషన్ ను తగ్గించడమే కాదు, ఏకంగా పారితోషికం అనే కాన్సెప్ట్ నుంచే పూర్ణ ఇప్పుడు బయటకొచ్చేసింది.ఇక డెయిలీ పేమెంట్స్ విధానంలోకి ఇప్పుడు పూర్ణ మారింది. ఇక మీకు పూర్ణ డేట్ కావాలా ? ఐతే, రోజుకింత ఇవ్వండి ? అంటూ ఆమె మేనేజర్ డైరెక్టర్లకు కాల్ చేసి మరీ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు. మరి ఈ సారైనా ఈ పూర్ణకు ఎక్కువ అవకాశాలు వస్తాయా ? నిజానికి చాన్నాళ్లుగా పూర్ణ తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతోంది. కానీ సరైన సక్సెస్ మాత్రం ఆమె అసలు అందుకోలేకపోయింది.మరీ ముఖ్యంగా చెప్పాలంటే పెద్ద సినిమా ఆఫర్లు పూర్ణకు అస్సలు రాలేదు. ఆ మధ్య అఖండ సినిమాలో ఓ పాత్రలో నటించినా కానీ అది ఆమె కెరీర్ కి కలిసిరాలేదు.ప్రస్తుతం పూర్ణకి హీరోయిన్ గా ఛాన్స్ లు ఆల్ మోస్ట్ అడుగంటాయి. దీంతో పారితోషికం తీసుకునే పద్ధతి నుంచి ఆమె బయటకొచ్చింది. పైగా కొన్ని సినిమాలకు అయితే, గంటల లెక్క కూడా తీసుకోవడానికి పూర్ణ చాలా ఆసక్తి చూపిస్తోందట.ఇక మొత్తానికి గంటకు ఇంత అని ఒక పేమెంట్ సెట్ చేసుకుంది పూర్ణ. అది హీరోయిన్ రోల్ అయినా కానీ అతిధి పాత్ర అయినా, చివరకు ఐటెం సాంగ్ అయినా కానీ ఇలా ఏదైనా గంటల లెక్కన పూర్ణకు సమర్పించుకోవాల్సిందే. హీరోయిన్ గా ఉన్నప్పుడు ఆమె సినిమాకు 30 లక్షల వరకు అందుకున్న పూర్ణ, ఇక ప్రస్తుతం డెయిలీ అండ్ గంటల పేమెంట్స్ లోకి మారి.. ఒక్కో సినిమాకు వచ్చేసి నెలకు 20 లక్షల రూపాయలు సంపాదిస్తోందట.ఇక తనకు ఇదే బాగుంది అంటుంది. కాకపోతే, గంటల లెక్కన మాట్లాడుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయని వాటిని భరిస్తూ సహిస్తూ ముందుకు పోతే.. కెరీర్ మరో నాలుగేళ్లు కొనసాగుతుంది అని పూర్ణ బాగా ఆశ పడుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: