టాలివుడ్ యంగ్ హీరో ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు..ఆ సినిమా తర్వాత డార్లింగ్ చేస్తున్న అన్నీ సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం.అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవి కూడా డార్లింగ్ కు పెద్దగా పేరును తీసుకోని రాలేదు..భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫిస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి.అయిన కూడా ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు.. మొన్నీమధ్య వచ్చిన సినిమా కూడా ఫ్యాన్స్ ను నిరాశ పరిచింది.ఆ సినిమా తర్వాత ఇప్పుడు నటిస్తున్న ఆదిపురుష్' కోసం కేవలం సౌత్ ఆడియెన్స్ మాత్రమే కాకుండా నార్త్‌లోనూ ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.


ఈ సినిమాను బాలీవుడ్ దర్శకడు ఓం రావుత్ తెరకెక్కిస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రామాయణం ఆధారంగా ఈ సినిమా రానుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.అయితే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ అనౌన్స్‌మెంట్, రిలీజ్ డేట్ తప్ప ఇప్పటివరకు ఈ సినిమా నుండి మరొక అప్‌డేట్ రాలేదు. దీంతో ఈ సినిమా యూనిట్‌పై ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్ కూడా గుర్రుగా ఉన్నారు.


అయితే, రామాయణంకు ప్రత్యేక రోజులైన శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వంటి పండగలకైనా ఈ సినిమా నుండి ఏదో ఒక అప్‌డేట్ కూడా రాకపోవడం తో డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.శ్రీరామనవమి నాడు ప్రేక్షకులను నిరాశపరిచిన ఆదిపురుష్ టీమ్, తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా కూడా సైలెంట్‌గా ఉండి మరోసారి ప్రేక్షకులను ఉసూరుమనిపించారు. ఇక ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ పర్ఫార్మెన్స్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆశగా చూస్తున్నారు..మరి ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఎప్పుడోస్తుందొ చూడాలి..కనీసం ఈ సినిమా అయిన హిట్ అవుతుందేమో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: