అక్కినేని హీరోల్లో వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న నాగ చైతన్య త్వరలో థ్యాంక్ యు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను విక్రం కె కుమార్ డైరెక్ట్ చేశారు. ఆల్రెడీ విక్రం తో మనం సినిమా చేసిన నాగ చైతన్య ఈ సినిమాతో ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నారు. అంతేకాదు చైతు కూడా ఇప్పుడు సూపర్ సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు. ఈమధ్యనే రిలీజైన థ్యాంక్ యు టీజర్ కూడా సినిమాపై అంచనాలు పెంచింది.

ఈ సినిమాలో చైతన్య మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. రాశి ఖన్నాతో పాటుగా మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా థ్యాంక్ యులో ఉన్నారు. ఇక ఈ సినిమాతో పాటుగా విక్రం కుమార్ తో దూత అనే వెబ్ సీరీస్ కూడా చేస్తున్నాడు అక్కినేన్ హీరో నాగ చైతన్య. నెట్ ఫ్లిక్స్ వారు నిర్మిస్తున్న ఈ వెబ్ సీరీస్ థ్రిల్లర్ జోనర్ లో రానుంది సినిమా, వెబ్ సీరీస్ రెండు ప్రాజెక్ట్ లతో విక్రం, నాగ చైతన్య ఇద్దరు తమ సత్తా చాటాలని చూస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత పరశురాం డైరక్షన్ లో నాగ చైతన్య సినిమా ఉంటుందని తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నాగేశ్వర రావు టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే ఈ సినిమాకు అల వైకుంఠపురములో.. గీతా గోవిందం సెంటిమెంట్ ఒకటి ఫాలో అవుతున్నారట. సినిమాలో హీరోయిన్ ఒక కంపెనీ సీ.ఈ.ఓ గా ఉంటుందట. అందులో ఎంప్లాయ్ గా హీరో ఉంటాడట. సో హీరోయిన్ ని మేడం మేడం అంటూ హీరో వెంటపడతాడు.

మేడం.. మేడం అనగానే గీతా గోవిందంలో విజయ్ రష్మికలు గుర్తుకొస్తారు. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలో మేడం సర్ మేడం అంతే అన్న బన్నీ గుర్తుకొస్తాడు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సో ఆ లెక్కన నాగ చైతన్య సినిమా కూడా పక్కా హిట్ అనేస్తున్నారు. గీతా గోవిందం డైరక్టర్ పరశురాం సర్కారు వారి పాటతో కమర్షియల్ మార్క్ చూపించగా నాగ చైతన్యతో మళ్లీ తన మార్క్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో వస్తాడని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: