టాలీవుడ్ సీనియర్ స్టార్స్ లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఎలాంటి నెగటివిటీ లేని టాలీవుడ్ హీరో కూడా ఆయనే అని చెప్పొచ్చు. సోలో హీరోగానే కాదు మల్టీస్టారర్ సినిమాలకు సైతం తాను రెడీ అంటుంటారు. అందుకే దర్శక నిర్మాతలు కూడా వెంకటేష్ తోనే ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు చేస్తుంటారు. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి ఎఫ్ 2 సినిమా చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు f3 అంటూ రాబోతున్నారు.

F2 ని మించిన కామెడీతో f3 వస్తుందని చిత్రయూనిట్ చెబుతున్నారు. సినిమా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో వెంకటేష్ ని మీడియా వాళ్లు ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. అందులోనే తనతో సమానమైన క్రేజ్, ఇమేజ్ ఉన్న చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణలు హోస్ట్ గా చేశారు. మీరు కూడా హోస్ట్ గా చేసే ఛాన్స్ ఉందా అని అడిగితే వెంకటేష్ నుండి క్రేజీ ఆన్సర్ వచ్చింది. తాను హోస్ట్ గా చేసే అవకాశం లేదని. తనకు ఒక డైలాగ్ ని పదే పదే రిపీట్ చేయడం నచ్చదని.

హోస్ట్ గా సేమ్ డైలాగ్ ని రిపీట్ చేయాల్సి ఉంటుందని. అలా చేస్తే తను మిగతాది అంతా మర్చిపోతానని అన్నారు వెంకటేష్. అయితే వెంకీ మామ ఇలా అంటారే కానీ ఈసారి అల్లు అరవింద్ ఆహా కోసం వెంకటేష్ ని దించినా దించుతారని ఫ్యాన్స్ అంటున్నారు. వెంకటేష్ ఫ్యాన్స్ కూడా వెంకీని హోస్ట్ గా చూడాలని కోరుతున్నారు. బిగ్ బాస్ లాంటి భారీ షోలకు చేయకపోయినా బాలయ్యలాగా జస్ట్ ఇంటర్వ్యూస్ చేసినా చాలని అంటున్నారు. మరి హోస్ట్ గా చేయడం కుదరదని చెప్పిన వెంకటేష్ ఆలోచన ఫ్యూచర్ లో అయినా మార్చుకుంటారా లేదా అన్నది చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: