టాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకరైన రానా దగ్గుబాటి ప్రస్తుతం విరాట పర్వం మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి వేణు ఊడుగుల దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో దగ్గుబాటి రానా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ  మూవీ లో మరో కీలకమైన పాత్రలో ప్రియమణి కనిపించబోతుంది. 

ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ మూవీ లో దగ్గుబాటి రానా నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనేక సార్లు  విడుదల వాయిదా పడిన విరాట పర్వం మూవీ ని జూలై 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ని జులై 1 వ తేదీన కాకుండా జూన్ 17 వ తేదీనే విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇలా  ముందు చెప్పిన తేదీ కంటే ముందుగానే ఈ మూవీ ని థియేటర్ లలోకి చిత్ర బృందం తీసుకు రాబోతుంది.  ఇలా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో విరాట పర్వం చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ ను వేగవంతం చేస్తుంది.

అందులో భాగంగా ఈ సినిమా నుండి ఒక సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. విరాట పర్వం సినిమా లో నుండి 'నగాదారిలో' అనే సాంగ్ ను రేపు ఉదయం 11.07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించగా, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ , సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: