కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనకు తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే సూర్య సినిమా వచ్చిందంటే అభిమానుల హడావిడి మామూలుగా ఉండదు.ఇదిలావుంటే తాజాగా సూర్య కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో అతిథి పాత్రలో సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే క్లైమాక్స్ చివరి ఐదు నిమిషాలలో సూర్య నటన అద్భుతమనే చెప్పాలి.ఇకపోతే ఈ సినిమాకు సూర్య పాత్ర కూడా చాలా హైలెట్ అయిందని పలువురు సూర్య పాత్ర గురించి తెలియజేశారు.ఇకపోతే కమల్ హాసన్ వంటి అగ్ర నటుడు సినిమాలో సూర్య చిన్న పాత్రలో కనిపించినప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. 

తమ అభిమాన నటుడిని ఇలా స్క్రీన్ పై ఒక్కసారిగా చూడటంతో సూర్య అభిమానులు కాస్త అత్యుత్సాహం చూపించారు. అయితే ఈ క్రమంలోనే పెద్దఎత్తున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇక పుదుచ్చేరిలోని ఒక థియేటర్లో విక్రమ్ సినిమా ప్రదర్శితమవుతుండగా అభిమానులు పెద్ద ఎత్తున సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.కాగా ఈ క్రమంలోనే క్లైమాక్స్ సన్నివేశాలలో సూర్య స్క్రీన్ పై కనిపించగానే ఆయన అభిమానులు ఎంతో సంతోషంలో థియేటర్ లో ఏకంగా టపాకాయలు పేల్చారు.కాగా దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో మంటలు స్క్రీన్ కి అంటుకొని పెద్ద ఎత్తున స్క్రీన్ మొత్తం కాలిపోతుంది. అయితే సినిమా అలా రన్ అవుతూ ఉండగానే స్క్రీన్ మొత్తం కాలిపోయింది. 

వెంటనే ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో పెద్దఎత్తున ప్రేక్షకులు థియేటర్ల నుంచి పరుగులు పెట్టారు.తరువాత పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు ప్రారంభించారు.ఫాన్స్ చూపిన అత్యుత్సాహం కారణంగా కొన్ని లక్షలలో నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.ఇదిలావుండగా ఈయనకు తమిళంతో పాటు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే తెలుగులో కూడా సూర్య సినిమాలకు విపరీతమైన ఆదరణ లభిస్తుందని చెప్పవచ్చు.ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి...!!!!

మరింత సమాచారం తెలుసుకోండి: