ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారి పోయింది పూజా హెగ్డే. తన అందం అభినయం తో ప్రేక్షకులను  కూడా పగటి కలల్లోకి నెడుతుంది ఈ సుందరి.  అంతేకాదు దర్శక నిర్మాతల చూపును కూడా ఆకర్షిస్తూ వరుస అవకాశాలు అందుకుంటుంది. అయితే మొన్నటి వరకు వరుస విజయా లతో దూసుకు పోతున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల వరుస పరాజయాల తో సతమతమవుతున్న విషయం తెలిసిందే.


 పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన రాధేశ్యాం, బీస్ట్, ఆచార్య సినిమాలు ఆశించినంత మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. దీంతో వరుసగా మూడు పరాజయాలు ఈ అమ్మడి ఖాతాలో చేరిపోయాయి. సాధారణం గా వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ వస్తే  ఆ హీరోయిన్ కి అవకాశాలు రావడం మాత్రం కష్టమే అన్నది తెలిసిందే. కానీ పూజా హెగ్డే కి మాత్రం వరస అవకాశాలు క్యూ కడుతూనే ఉన్నాయి. అదే సమయంలో వరుసగా ఫ్లాపులు వస్తున్న ఈ అమ్మడు మాత్రం రెమ్యునరేషన్ అంతకంతకూ పెంచుతూ పోతోంది అని తెలుస్తోంది. ఇక ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనగణమన సినిమాలో కూడా నటిస్తుంది ఈ పొడుగుకాళ్ల సుందరి.


 ఇకపోతే విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న జనగణమన సినిమా కోసం భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట ఈ అమ్మడు. ఏకంగా 5 కోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే జనగణమన సినిమా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతు ఉండటమే దీనికి కారణమట. పూజా హెగ్డే ఐదు కోట్లు డిమాండ్ చేయడమే కాదు అటు నిర్మాతలు కూడా అంత మొత్తం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇదే నిజమైతే మాత్రం పూజా హెగ్డే కెరియర్లోనే ఇదే అత్యధిక పారితోషికం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: