టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న అనిల్ రావిపూడి తాజాగా ఎఫ్ 3 మూవీ కి దర్శకత్వం వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించగా , మిల్కీ బ్యూటీ తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా నటించారు.

మూవీ లో సోనాల్ చౌహాన్ ఒక కీలకమైన పాత్రలో నటించగా రాజేంద్రప్రసాద్ , అలీ , సునీల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. మే 27 వ తేదీన థియేటర్లలో విడుదల అయిన మూవీ  ఎఫ్ 3 మూవీ బ్9స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం మంచి కలెక్షన్ లను రాబడుతోంది. ఇది ఇలా ఉంటే ఎఫ్ 2 మూవీ కి ఎఫ్ 3 మూవీ సీక్వెల్ గా తెరకెక్కడం. ఎఫ్ 3 మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఎఫ్ 3 మూవీ కి అదిరిపోయే రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ కి దాదాపుగా 63.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. 63.60  కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఎఫ్ 3 మూవీ 64.60 కోట్ల భారీ బడ్జెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలో దిగింది.

ఇప్పటివరకు 14 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఎఫ్ 3 మూవీ ప్రపంచవ్యాప్తంగా 52.98 కోట్ల షేర్ , 88.80 కోట్ల గ్లాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా సాధించిన కలెక్షన్లను బట్టి చూస్తే ఎఫ్ 3 మూవీ ప్రపంచ వ్యాప్తంగా క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా 11 52 కోట్ల కలెక్షన్ లను బీసీ ఆఫీస్ దగ్గర రాబట్టవలసి ఉంది. ఇప్పటికే ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకున్న ఎఫ్ 3 మూవీ,  నైజాం ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ ఫార్ములాకు అతి దగ్గరలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: