అది కూడా డైరెక్టర్ వంశీ పైడిపల్లి కావడంతో ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్న అభిమానులు. ఇక అంతే కాకుండా నిర్మాతగా దిల్ రాజు కావడంతో ఈ సినిమా పై మరింత ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి సగానికి పైగా పూర్తి చేసినట్లుగా సమాచారం. మరో రెండు మూడు నెలల్లో ఈ చిత్రం పూర్తి అయ్యే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. రష్మిక మాట్లాడు తూ విజయ్ తో తాను చేస్తున్న సినిమాలో నా పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని తెలిపింది.
ఒక స్టైలిష్ అమ్మాయిగా తల పొగురు ఎక్కువగా ఉండే అమ్మాయిగా కనిపించబోతున్నట్లు గా తెలియజేసింది. విజయ్ కు తనకు మధ్య జరిగే కొన్ని సన్నివేశాలలో తలపొగరు ఎక్కువగా ఉన్నట్లుగా చూపించబోతున్నారు డైరెక్టర్ అని తెలియజేసింది. ఇది తన కెరియర్ లో ఒక మంచి పాత్ర అవుతుంది అని భావిస్తున్నట్లుగా తెలియజేసింది. ఇక బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న యానిమల్ లో కూడా రష్మిక నటిస్తున్నది. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ కు జోడిగా నటిస్తున్న ది.మొత్తానికి ఒకేసారి పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ పాన్ ఇండియా హీరోయిన్గా సత్తా చాటుతోంది రష్మీక.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి