డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ సినిమాని దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సృష్టిస్తోంది. ఇందులో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, నరేష్ వంటి వారు కీలకమైన పాత్రలో నటించారు. ఇ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో కమల్ హాసన్ ఈ సినిమా సక్సెస్ కి ఆనందానికి అవధులు లేవు. క్లైమేట్ చివర్లో హీరో సూర్య ఎంట్రీ కూడా అదిరిపోయింది అని చెప్పవచ్చు. రోలెక్స్ పాత్రలు సూర్య అద్భుతమైన నటనను ప్రదర్శించారు.
ఇక ఇదంతా ఇలా ఉండగా ఇందులో కీలకమైన పాత్రలో నటించిన టినా అనే మహిళ విలన్లకు చుక్కలు చూపించింది. కేవలం వన్ పిక్చర్ తోనే విలన్లను ఎదుర్కొని ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక కమల్ కొడుకు ఇంట్లో పనిమనిషిగా ఉన్న టీనా ఉన్నట్టుండి రిపోర్టింగ్ సర్ అంటూ విలన్లకు చెమటలు పట్టించింది. అయితే ఇంతకు ఎవరు ఈ టినా అనే విషయానికి వస్తే. ఈమె అసలు పేరు వాసంతి ఇమే ఒక కొరియోగ్రాఫర్. కోలీవుడ్‌లో టాప్ స్టార్స్ నటించిన పలు చిత్రాలకు ఈయన కొరియోగ్రాఫర్‌గా వరకు చేసింది. అయితే ఈమె విక్రమ్ సినిమాతో తొలిసారిగా వెండితెరపై కనిపించింది. విక్రమ్ లో కూడా విభిన్నమైన పాత్రను పోషించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.