ప్రముఖ హాస్య నటుడు ఆలీ గురించి అందరికి తెలుసు..చైల్ద్ ఆర్టిస్టు గా ఇండస్ట్రీకి పరిచయమై ఎన్నో వందల సినిమాలలో నటించారు.. ఆయన కామెడీ టైమింగ్, అతని యాక్షన్ జనాలను విపరీతంగా ఆకట్టుకోవడం తో మంచి నటుడు, కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక విషయానికొస్తే..టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్స్ ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోతాయి. అది హీరో-హీరోయిన్లు మాత్రమే కాదు.. హీరో-కమెడియన్ కాంబినేషన్ అయినా ప్రేక్షకులను మెప్పిస్తే, వారు ఆ కాంబినేషన్‌ను మళ్లీ మళ్లీ చూడాలని కోరుకుంటారు.


అలాంటి కాంబినేషన్‌లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ ఆలీది కూడా ఒకటి. పవన్ నటించిన దాదాపు అన్ని సినిమాల్లోనూ ఆలీ మనకు కనిపిస్తాడు. వీరిద్దరి కోసం దర్శకులు కొన్ని స్పెషల్ సీన్స్ కూడా రాసుకున్నారంటే, వీరిద్దరి కాంబినేషన్ ఏ రేంజ్‌లో పండిందో మనం అర్ధం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం నుంచి ఆలీ పవన్ సినిమాల్లో కనిపించడం మానేశాడు. దీనికి అనేక కారణాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు జోరుగా వినిపించాయి. కానీ వాటిపై ఈ ఇరువురు కూడా నోరు విప్పలేదు.


కానీ, ఇప్పుడు ఈ విషయంపై కమెడియన్ ఆలీ స్పందించాడు. ఆలీ హోస్ట్ చేస్తున్న 'ఆలీతో సరదాగా' టాక్ షోలో హీరో కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న 'సమ్మతమే' చిత్ర యూనిట్ సందడి చేసింది..ఆలీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎందుకు కనిపించడం లేదని.. మళ్లీ వారి కాంబినేషన్‌లో సినిమా వస్తుందా అని ఆలీని ప్రశ్న అడిగారట. దీనికి సమాధానంగా.. కారణాలు ఏవైనా, పవన్‌తో కొంతకాలంగా కలిసి యాక్ట్ చేయలేకపోయానని.. త్వరలోనే మళ్లీ మా ఇద్దరి కాంబినేషన్ ఖచ్చితంగా ఉంటుందని ఆలీ అన్నాడట. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఒకప్పుడు పవన్-ఆలీ కాంబినేషన్ స్క్రీన్‌పై కనిపించిందంటే, ఆ సినిమా గ్యారెంటీ హిట్ అనే ముద్ర పడింది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరినీ ఒకేస్క్రీన్‌పై చూసేందుకు పవన్ అభిమానులతో పాటు ఆలీ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు..ఏ డైరెక్టర్ తో వీరి సినిమా ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: