తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూర్ణ ఎందుకో తక్కువ సినిమాలకు మాత్రమే పరిమితం అయింది. ఎన్ని సినిమాల్లో నటించిన ఈ అమ్మడికి మాత్రం సరైన గుర్తింపు రాలేదు అని చెప్పాలి.  ముఖ్యంగా రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అవును అనే క్రైమ్ థ్రిల్లర్  సినిమా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత వచ్చిన అవును 2 తో సినిమా కూడా హిట్ అయింది. కానీ ఈ అమ్మడికి మాత్రం సరైన అవకాశాలు రాలేదు. దీంతో కొన్ని సినిమాలలో  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. ఇప్పుడు కూడా స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తోంది పూర్ణ.


 అదే సమయంలో అటు బుల్లితెరపై కూడా సందడి చేస్తోంది అన్న విషయం తెలిసిందే.  మొన్నటి  వరకు ఈ టీవీలో ప్రసారమయ్యే ఢీ షో లో జడ్జి గా వ్యవహరించిన పూర్ణ తనకు నచ్చేలా ఎవరైనా పర్ఫామెన్స్ చేశారు అంటే చాలు హగ్గులు ముద్దులు ఇస్తూ ఇక వార్తల్లో  హాట్ టాపిక్ గా మారిపోయింది. అదే సమయంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి అని చెప్పాలి. కానీ గత కొంత కాలం నుంచి ఢీ షో లో కనిపించడం లేదు పూర్ణ. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఇంద్రజ స్థానంలో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఢీ షో లాగా హగ్గులు ముద్దులు ఇవ్వడం మానేశాను అంటూ చెప్పుకొచ్చింది.


 ఇక ఇప్పుడు పెళ్ళాం చెబితే వినాలి అనే కార్యక్రమం ఆదివారం ప్రసారం కానుంది. ఇందులో జబర్దస్త్ కమెడియన్ తో పాటు బుల్లితెర నటులు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే హైపర్ ఆది రష్మీ ని ఆటపట్టించాడు. ఇక రష్మీ ఏం చేసిన సుధీర్ కి ఫోన్ చేసినట్లుగా మాట్లాడాడు. అదే సమయంలో పూర్ణ కి కూడా  కౌంటర్ ఇచ్చాడు. వెంటనే స్పందించిన పూర్ణ అదేంటి నా గురించి సుదీర్ కు ఎందుకు చెప్తున్నావ్..  నాకు ప్రదీప్ తో కదా లింకు ఉంది అంటూ నోరు జారింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇలా పూర్ణ ప్రదీప్ తో ఉన్న సంబంధం గురించి చెప్పింది అంటూ అనుకుంటున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: