నందమూరి బాలకృష్ణ వరుస మాస్ చిత్రాలను ఒప్పుకోవడం ఆయన అభిమానులలో ఎంతో జోష్ ను నింపుతుంది. పోయిన ఏడాది అఖండ సినిమాతో సంచలన విజయాన్ని అందుకుని రికార్డుల మీద రికార్డులు సృష్టించి భారీ వసూళ్లను సాధించిన నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది మరో మాస్ మసాలా సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న తన 107 సినిమా యొక్క షూటింగ్ శరవేగంగా జరుపుతున్నాడు.

శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా లో కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నాడు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుండగా ఈ చిత్రం ద్వారా తాను మరొకసారి భారీ విజయాన్ని అందుకోవడం ఖాయం అని బాలకృష్ణ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇప్పుడు మరొక మాస్ సినిమా లు చేసే దర్శకుడైన అనిల్ రావిపూడి నీ తదుపరి సినిమా డైరెక్టర్ గా ఎంచుకోవడం విశేశం. 

తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు అన్ని సినిమాలతో విజయం అందుకున్న దర్శకుడైన అనిల్ రావిపూడి తన తదుపరి సినిమా బాలకృష్ణ తో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. తన గత సినిమాల మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా చేస్తారని ఆయన చెబుతూ ఉండడం నందమూరి అభిమానులను ఎంతగానో సంతోషపెడుతుంది. వరుస ఫ్లాప్ లతో సతమతమైన బాలకృష్ణ అఖండ సినిమాతో తన విజయ పరంపరను మొదలు పెట్టగా గోపీచంద్ మలినేని సినిమా దాన్ని కొనసాగిస్తుందని అంటున్నారు. ఇప్పుడు అనిల్ రావిపూడి తో చేసే సినిమా కూడా మంచి విజయాన్ని దక్కించుకోబోతుంది అని అంటున్నారు. ఇటీవలే ఎఫ్ 3 సినిమా తో విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడిసినిమా ను సైతం అదే స్థాయి లో చేయబోతున్నాడని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: