ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాల హవా బాగా కొనసాగుతోంది. ఈ ఏడాది విడుదలైన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో క్రియేట్ చేసిన రికార్డులు అన్నీఇన్నీ అయితే కావు.


అయితే టాలీవుడ్ లో మరో భారీ మల్టీస్టారర్ కు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో వెంకటేష్ ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తున్నారనే విషయం తెలిసిందే. అయితే శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వెంకటేష్, రవితేజ కాంబినేషన్ లో ఒక మల్టీస్టారర్ తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.


వైరల్ అవుతున్న వార్తల వల్ల ఈ కాంబినేషన్ పై అంచనాలు మరింత పెరిగాయి. శ్రీకాంత్ అడ్డాల వెంకటేష్ కాంబినేషన్ లో ఇప్పటికే పలు సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సొంతం చేసుకున్నాయి. శ్రీకాంత్ అడ్డాలపై నమ్మకం ఉన్న అతికొద్ది మంది హీరోలలో వెంకటేష్ ఒకరు కాగా రవితేజ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా తెరకెక్కలేదు.


 


మరి ఈ కాంబినేషన్ లో సినిమా దిశగా అడుగులు పడతాయో లేదో చూడాలి మరి.అయితే ఈ సినిమాకు నిర్మాత ఎవరనే విషయం తెలియాల్సి ఉంది.. ప్రస్తుతం రవితేజ, వెంకటేష్ ఒక్కో సినిమాకు భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నా రు. వెంకటేష్ తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలను ప్రకటించలేదు. గత కొన్నేళ్లుగా వెంకటేష్ నటించిన సినిమా లు వరుస విజయాల ను సొంతం చేసుకున్నాయి.


 


వెంకటేష్ తర్వాత ప్రాజెక్ట్ ల తో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాల ని ఫ్యాన్స్ కోరుకుంటున్నార ట.వైరల్ అవుతున్న వార్తల గురించి శ్రీకాంత్ అడ్డాల ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.బ్రహ్మోత్సవం ఫ్లాప్ వల్ల శ్రీకాంత్ అడ్డాల కు ఆఫర్లు తగ్గాయనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: