ప్రస్తుతం థియేటర్ లలో విడుదల అయిన సినిమాలలో చాలా సినిమాలు అతి తక్కువ రోజుల్లోనే ఏదో ఒక 'ఓ టి టి' ప్లాట్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి. ఏవైనా కొన్ని మూవీ లు థియేటర్ లలో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని లాంగ్ రన్ లో కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను రాబట్టి నట్లయితే ఆ సినిమాలు మాత్రం కొంత ఆలస్యంగా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ ల లోకి వస్తున్నాయి.

అదే థియేటర్ లలో మామూలు కలెక్షన్ లు వస్తున్న సినిమాలలో కూడా చాలా ఎక్కువ సినిమాలు అతి తక్కువ కాలంలోనే 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలోకి వచ్చేస్తున్నాయి  ఇది ఇలా ఉంటే తాజాగా దగ్గుబాటి రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాట పర్వం సినిమా జూన్ 17 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ప్రేమ కథను మిక్స్ చేస్తూ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనే టాక్ రావడంతో, ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం మంచి కలెక్షన్లను రాబడుతున్న ఈ సినిమా 'ఓ టి టి' విడుదలకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.

సినిమా 'ఓ టి టి' హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థ నేట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు, ఈ సినిమాను జూలై 15 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ప్రియమణి ఒక కీలక పాత్రలో నటించగా,  సురేష్ బెబ్బులి ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: