ప్రేమదేశం 1980 కిడ్స్ కి ఈ సినిమా ఒక దృశ్య కావ్యం.అయితే  అప్పటి వరకు వచ్చిన సినిమా లు ఒక ఎత్తు అయితే ఆ సినిమా మరో లెవల్. ఇకపోతే ప్రేమదేశం సినిమా ను చూసిన తర్వాత ఎంతో మంది కాలేజీకి వెళ్లిన వారు ఉన్నారు.ఇక ఇప్పటికి కూడా ముస్తాఫా పాట ప్రతి కాలేజీ ఫేర్వెల్ ఫంక్షన్ లో వినిపిస్తూనే ఉంటుంది. అయితే అంతటి పాపులర్ మూవీ ప్రేమ దేశంలో హీరోగా నటించిన అబ్బాస్ ఇప్పటి వారికి గుర్తు లేకున్నా అప్పటి వారు మాత్రం మర్చిపోయే అవకాశమే లేదు.ఇకపోతే ఇప్పటికి కూడా అబ్బాస్ అంటే ఠక్కున ఆయనే గుర్తుకు వస్తాడు.

 ఇక అంతటి పాపులారిటీని దక్కించుకున్న అబ్బాస్ చాలా సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.అయితే సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉన్నా కూడా ఇన్నాళ్లు పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో.. రాకపోవడంతో అబ్బాస్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఇదిలావుంటే తాజాగా ఎట్టకేలకు అబ్బాస్ రీ ఎంట్రీకి సిద్ధం అయ్యాడనే వార్తలు వస్తున్నాయి.అయితే  ఒక మాస్ మసాలా ఎంటర్ టైనర్ మూవీలో కీలక పాత్రలో నటించేందుకు గాను అబ్బాస్ ఓకే చెప్పాడని తెలుస్తోంది.ఇకపోతే గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక కమర్షియల్ సినిమా లో మొదట సీనియర్ హీరో రాజశేఖర్ ను అనుకున్నారు.

 జగపతి బాబు ను కూడా ఈ సినిమా కోసం సంప్రదించారట.ఇక రాజశేఖర్ నో చెప్పడంతో అబ్బాస్ ను లైన్ లోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో ఆ రెండు పాత్రలు కూడా అత్యంత కీలకంగా చెబుతున్నారు.ఇక అందుకే సీనియర్ హీరోలను తీసుకోవాలని దర్శకుడు శ్రీవాస్ బలంగా కోరుకున్నాడు.కాగా  రాజశేఖర్ తప్పుకోవడంతో అబ్బాస్ ను రంగంలోకి దించేందుకు దర్శకుడు రెడీ అయ్యాడని తెలుస్తోంది.ఐరహే చాలా సంవత్సరాల తర్వాత అబ్బాస్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో అప్పటి ప్రేక్షకులు ఖచ్చితంగా ఒకింత ఎగ్జైట్ ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: