ఒక సినిమా కథ ఒక్కరితో ఆగిపోయే సందర్భాలు చాలా తక్కువ. అలా ఒక కథ ఒక హీరో దగ్గర నుండి చాలా మంది హీరోల చేతులకి వెళ్లి చివరకు ఎవరో ఒకరి దగ్గర ఆగుతుంది. అలా ఒక హీరో చేయాల్సిన సినిమా డేట్స్ కుదరక పోవడమో, కథ నచ్చకపోవడమో వంటి కారణాల వలన వేరొక హీరో చేతికి వెళుతుంది. ఇదే తరహాలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేయాల్సిన సినిమా కాస్త కమిడియన్ అలి చేతికి వెళ్ళింది. ఆ సినిమా అలి కెరియర్ నే మలుపు తిప్పిన ది బెస్ట్ చిత్రంగా నిలిచిపోయింది. అదేంటి మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమా అలి చేతికి వెల్లడమా...ఇంతకీ ఏ సినిమా అది అని ఆశ్చర్యపోతున్నారా..!!!

ఇది ఇప్పటి మాట కాదులెండి. యమలీల సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించింది అన్నది తెలిసిందే. అప్పటి వరకు కమిడియన్ గా కొనసాగుతున్న అలి ని ఈ చిత్రం హీరోగా మార్చడమే కాకుండా అతడి కెరియర్ లో జోష్ పెంచింది. ఈ సినిమా ఇప్పుడు టీవిలో వచ్చినా అంతా టీవీలకు అతుక్కుపోతారు. అంతగా ఈ సినిమా ఆదరణ పొందింది. అయితే ఈ సినిమా కథ మొదటిగా కృష్ణ గారి దగ్గరకు వెళ్లిందట.. అది కూడా మహేష్ బాబు కోసం. అప్పట్లో మహేష్ బాబు బాలనటుడిగా ఉన్నారు. అయితే కథ బాగా సూట్ అవుతుంది అని మహి అయితే బాగుంటుంది అని అంతా అనుకున్నారట. కృష్ణ గారికి కూడా ఈ కథ ఎంతగానో నచ్చింది అయితే కొన్ని కారణాల వలన మహేష్ బాబు చేయలేకపోయాడు.

అలా యమలీల సినిమా ఆఫర్ కాస్త ఆలీ చేతికి వెళ్ళింది. ఎవరూ ఊహించని స్థాయిలో సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అలీ కెరీర్ నే మార్చేసింది.  అప్పటి వరకు కామెడీ రోల్స్ చేస్తున్న అలీ ఈ సినిమాతో హీరోగా మారడంతో పాటు కమర్షియల్ సక్సెస్ ను అందుకుని కెరియర్ లో దూకుడు పెంచారు. ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న  ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది.


   

మరింత సమాచారం తెలుసుకోండి: