సినిమా ఇండస్ట్రీలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మందికి వరస విజయాలు బాక్సాఫీస్ దగ్గర దక్కినప్పటికి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు మాత్రం పెద్దగా లభించవు. అలా ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాలతో మంచి విజయాలను అందుకని , స్టార్ హీరోల సరసన మాత్రం అవకాశాలను దక్కించుకోలేకపోయిన ముద్దుగుమ్మలో ప్రియాంక జవాల్కర్ ఒకరు. ప్రియాంక జవాల్కర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన టాక్సీవాలా మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. 

సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ప్రియాంక జవాల్కర్ ఆ తర్వాత తిమ్మరుసు , ఎస్ ఆర్ కళ్యాణమండపం లాంటి రెండు సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజు విడుదల కావడం విశేషం. ఒకే రోజు విడుదల అయిన ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించాయి. ఇలా ఇప్పటివరకు ప్రియాంక జవాల్కర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటించిన అన్ని సినిమాలు కూడా దాదాపుగా మంచి విజయాలను సాధించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు స్టార్ హీరోల నుంచి మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. ఇది ఇలా ఉంటే నటించినది తక్కువ సినిమాలే అయిన ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా వారితో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. 

అలాగే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా ప్రియాంక జవాల్కర్ తన ఇన్ స్టా లో  కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ప్రియాంక జవాల్కర్ తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రియాంక జవాల్కర్ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: