మహేష్ నమ్రత జంట ప్రస్తుతం విదేశాలలో విహార యాత్రలు చేస్తున్నారు. వీరిద్దరూ ఇలా చేసిన ప్రతి సారి కూడా హాట్ టాపిక్ గానే మారుతూ ఉంటారు. ఏడాది క్రితం రెండు మూడు సార్లు ఈ జంట తమ పిల్లలతో బంధువులతో కలిసి విదేశాలకు వెళ్లడం ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. మహేష్ లైఫ్ ఎంత బిజీగా ఉన్నా కూడా కుటుంబంతో గడపడానికి మాత్రం సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. మహేష్ నమ్రత టాలీవుడ్ లోనే పర్ఫెక్ట్ కపుల్ అని చెప్పవచ్చు. అందుచేతనే వీరికి మరింత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని చెప్పవచ్చు.


ప్రస్తుతం నమ్రత మహేష్ ఇద్దరూ కూడా న్యూయార్క్ నగరంలో విహార యాత్ర బాగా ఆస్వాదిస్తూన్నట్లుగా కనిపిస్తోంది. ఇక నిరంతరం విలాసవంతమైన భవంతులు ఆన్ రోడ్ స్పాట్ నుంచి జంట ఒక ఫోటోని షేర్ చేసింది ప్రస్తుతం అది చాలా వైరల్ గా మారుతున్నది. తాజాగా ఈ ఫోటో షేర్ చేసిన ఫోటో ని చూస్తే 47 ఏళ్ళ మహేష్ బాబు 25 సంవత్సరాల యువకుడు గా కనిపిస్తున్నారు. కానీ నమ్రత మాత్రం తనకంటే చాలా ఓల్డ్ గా కనిపిస్తోందని అభిమానులు సైతం కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మహేష్ బాబుతో ఉంటే ఎవరికైనా ఈ సమస్య ఎదురవుతుందని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే మహేష్ నటించిన సర్కారీ వారి పాట చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇక తన తదుపరి చిత్రం రాజమౌళి తో భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్న చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం అందుకోసం మహేష్ బాబు మునుపెన్నడూ లేని విధంగా కాల్ షిట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇక ఈ ఈ సినిమా కాకముందే డైరెక్టర్ త్రివిక్రమ్ తో కూడా ఒక సినిమాని చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడ పూర్తయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: