ఇండస్ట్రీలో ఇపుడు పెద్ద ఇరకాటమే వచ్చి పడింది.. 'వెనక చూస్తే నుయ్యి ముందు చూస్తే గొయ్యి' అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇంతకీ విషయం ఏమిటంటే సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి , యంగ్ హీరో అక్కినేని అఖిల్ మద్య పోటీ నెలకొనేలా ఉంది అంటున్నారు కొందరు. అదేనండి చిరు 'భోళా శంకర్' సినిమా అలాగే అఖిల్ ఎంత సినిమాకి మధ్య విషయం అన్నమాట. మెగా ఇంటికి , అక్కినేని కుటుంబానికి మద్య సుదీర్ఘ కాలం నుండి సత్సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయి, వీరి మధ్య బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా అలాంటిది ఈ ఇరు హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడనున్నారా అంటే ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు కాదనే అనే వినిపిస్తోంది.

ఏజెంట్ సినిమా కోసం అఖిల్ నానా తంటాలు పడి సిక్స్ ప్యాక్ తో మాసీ లుక్ తో సిద్దమయ్యాడు. ఇప్పటి వరకు అక్కినేని అఖిల్ కెరియర్ లో సరైన హిట్ ఒక్కటి పడలేదని చెప్పాలి. అలాంటి తరుణంలో ఏజెంట్ మూవీ అఖిల్ కెరియర్ లోనే కీలకంగా మారుతుందని అంతా భావిస్తున్నారు. అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా అఖిల్ సినిమాకి ఇపుడు భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఏజెంట్ సినిమాకి బయట మార్కెట్ లో ఫుల్ బజ్ క్రియేట్ అయుంది. అక్కినేని అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. తొలుత ఆగస్ట్ 12 రిలీజ్ డేట్ ని గతంలో ఓసారి ప్రకటించారు. కానీ ఇప్పుడు అది కాస్త వాయిదా పడిపోయింది. కాకపోతే మళ్ళీ ఎప్పుడనేది రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తారు అన్నది ఇపుడు ప్రశ్న. కాగా ఏజెంట్ సినిమాని దసరా సంబరాల మద్య రిలీజ్ చేస్తే ఫలితం డబుల్ అవుతుంది అని అనుకుంటున్నట్లు సమాచారం.  

ఇక మరో వైపు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రం కూడా దసరా సీజన్ లోనే విడుదల చేస్తారని మొదట నుండి వినిపిస్తుండగా... అయితే ఈ రెండు చిత్రాల మద్య ఇపుడు క్లాష్ తప్పదా అని అంతా కంగారు పెడుతున్న క్రమంలో తాజా సమాచారం మేరకు ఈ రెండు సినిమాలకు క్లాష్ ఉండదనే తెలుస్తోంది. ఆచార్య డిజాస్టర్ తర్వాత గాడ్ ఫాదర్ తో సక్సెస్ కొట్టడం మెగాస్టార్ కు చాలా ముఖ్యం... కాగా అలాంటి సమయంలో ఎంతో బజ్ క్రియేట్ చేసుకున్న యువ హీరో అఖిల్ సినిమాతో పోటీ పడటానికి దిగడని అనుకుంటున్నారు. ఇదంతా కాదు అసలు విషయం కూడా మరొకటి ఉంది. ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకరనే భోళా శంకర్ కి కూడా నిర్మాతగా వ్యవహరించారు. కాబట్టి తన రెండు చిత్రాలకు క్లాష్ పెట్టి ఒక సినిమాతో గెలిచి మరొక సినిమాతో డౌన్ అవ్వాలని ఎవరు అనుకోరు కదా.  

మరింత సమాచారం తెలుసుకోండి: