వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇటీవల ప్రేక్షకులకు కామన్ షోగా అయిపోయింది. ఎందుకంటే బుల్లితెర రియాల్టీ షో లలో ఒకటైన ఈ షో కి ప్రతి సంవత్సరం కూడా రేటింగ్స్ బాగా తగ్గిపోతున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ షోలో ఇచ్చే టాస్కులు రొటీన్ గా ఉండడంతో చాలామంది ప్రేక్షకులు ఈ షో ని చూడడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇకపోతే తాజాగా ఓటీటీలో బిగ్ బాస్ ఓటిటీ పూర్తి అయిన నేపథ్యంలో బుల్లితెరపై మళ్ళీ బిగ్ బాస్ సీజన్ సిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సామాన్యులకు కూడా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. తాజాగా వస్తున్న వార్త ఏమిటంటే త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 6 లోకి తరుణ్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్త బాగా వైరల్  అవుతోంది.

ఇక తన కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను పొందిన తరుణ్ ఆ తర్వాత సినిమాలు ఈయనకు పెద్దగా అదృష్టాన్ని తెచ్చి పెట్టలేదని చెప్పాలి. వరుసగా డిజాస్టర్ లను అందుకుంటూ పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇదిలా వుండగా..  బిగ్ బాస్ లోకి సినీ నటులకు  అవకాశం రావడం.. ప్రేక్షకులలో వీరికి మళ్ళీ ఇమేజ్ పెరగడంతో వారికి సినిమా ఆఫర్లు వస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే తరుణ్ కూడా గతంలో వరుస సినిమాలు డిజాస్టర్ కావడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈయన.. ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే తరుణ్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తే ఆయనకు మళ్ళీ సినిమాలలో ఆఫర్ వచ్చే అవకాశం ఉంది అని ఆయన అభిమానులు అనుకుంటున్నారు.

ఇకపోతే గతంలో కూడా బిగ్ బాస్ షోలోకి తరుణ్ ఎంట్రీ ఇస్తున్నాడు అనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి. కానీ అప్పుడు తరుణ్ ఏమాత్రం స్పందించలేదు. మళ్లీ ఈ వార్తలు వైరల్ అవుతూ ఉండడంతో స్పందిస్తాడా లేదా అనే విషయం అందరికీ సందిగ్ధంగా మారింది. వరుస పుకార్లపై ఎట్టకేలకు తరుణ్ స్పందించాల్సి ఉంది. ఇకపోతే సీజన్ 6 కి కూడా నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: