హిట్‌ రైటర్‌గా కొంతమందికి పరిచయం ఉన్న కొరటాల శివను దర్శకుడిని చేసిన చిత్రం 'మిర్చి'. ప్రభాస్‌ నెవర్‌ బిఫోర్‌ లుక్‌లో చూపించి అందరి చేత వావ్‌ అనిపించారు కొరటాల శివ.


అయితే ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో సినిమా రాలేదు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి ఏదో లోటుగా వుంది.. మరో 'మిర్చి' లాంటి సినిమా డార్లింగ్‌కి పడితే ఆ లెక్కే వేరు అనుకుంటూ ఉంటారు. అలాంటివారికి గుడ్‌ న్యూస్‌. ప్రభాస్‌ - కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని సమాచారం.త్వరలోనే క్లారిటీ వస్తుంది అంటున్నారు.


కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్‌ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే సినిమా ప్రారంభం కావాల్సి ఉన్నా.. వివిధ కారణాల వల్ల సినిమాల ఆలస్యమవుతూ వస్తోందట.. ఈ నెలలో మొదలవుతుంది అని అంటున్నారు. అయితే కొరటాల టీమ్‌ మరో సినిమా పనుల్లో కూడా బిజీగా ఉందని సమాచారం. అదే ప్రభాస్‌ సినిమా. డార్లింగ్‌ సినిమా కోసం కొరటాల టీమ్‌ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది.ఎన్టీఆర్ సినిమా తర్వాత కొరటాల - ప్రభాస్‌ కాంబో ఉంటుందని లేటెస్ట్‌ సమాచారం.


 


నిజానికి ఎన్టీఆర్‌ సినిమా తర్వాత అల్లు అర్జున్‌తో కొరటాల సినిమా చేస్తారని ఆ మధ్య వార్తలు అయితే చ్చాయి. అయితే బన్నీతో సినిమా ఇంకా ఫైనల్ అవ్వలేదట. మరోవైపు బన్నీ బాలీవుడ్‌ ప్రయత్నాలు చేస్తుండటంతో.. కొరటాల వేరే హీరోను చూసుకుంటున్నారని టాలీవుడ్‌ సమాచారం. ఈ క్రమంలో రామ్‌చరణ్‌తో కొరటాల సినిమా ఉంటుందని కూడా వార్తలొచ్చాయి. మ్యాగ్జిమమ్‌ ఈ సినిమా ఓకే అయినట్లే అని కూడా చెప్పారు. తీరా చూస్తే ఆ సినిమా కూడా ఓకే అవ్వలేదని, ఇంకా పెండింగ్‌లోనే ఉందని కూడా చెబుతున్నారు.


 


దీంతో తనకు దర్శకుడిగా తొలి ఛాన్స్‌ ఇచ్చిన ప్రభాస్‌తోనే సినిమా చేయాలని కొరటాల అనుకుంటున్నారని తెలుస్తుంది.మరోవైపు ప్రభాస్‌ కూడా వరుసగా పాన్‌ ఇండియా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ లెక్కన కొరటాల శివ సినిమా కూడా పాన్‌ ఇండియా అవుతుందా? అనేది మరి చూడాలి. ఆ మధ్య పాన్‌ ఇండియా గురించి కొరటాలను అడిగితే ఏదైనా సినిమా పాన్‌ ఇండియానా కాదా అనేది కథ నిర్ణయిస్తుందని అన్నారు. మరిప్పుడు ఎలాంటి కథ రాస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: