నటుడిగా , నిర్మాతగా ఎన్నో విజయాలను అందుకుని ప్రస్తుతం కెరియర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్న కళ్యాణ్ రామ్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా, నిర్మాతగా తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసార అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే .

ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్ , సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించగా,  ఈ సినిమాకు మల్లాడి వశిష్ట్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఆగస్ట్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో పాటు కళ్యాణ్ రామ్ చేసిన పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. అలాగే ఈ సినిమా ట్రైలర్ గమనించినట్లయితే ఈ మూవీ కోసం భారీ బడ్జెట్ తో గ్రాఫిక్స్ ను రూపొందించినట్లు గా అర్థం అవుతోంది. ఎంత మంచి వాడవురా సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ 'బింబిసార' సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయం లోకి వెళితే... బింబిసార నైజాం ఏరియా థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు 5.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వార్తపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: