కొద్దిరోజుల పాటు షూటింగ్ కూడా పాల్గొన్న ఒక్కసారిగా షాక్ అన్నట్లుగా సినిమా ఆగిపోవడం జరిగింది. ఆ సినిమా షూటింగ్ మొదలు ఎన్నో అవంతరాలు రావడంతో సినిమా మొత్తానికి నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. ఆమధ్య నిర్మాతలకు దర్శకుడు శంకరకు మధ్య చర్చలు కూడా జరిగాయట. కానీ అసలు విషయం ఏమిటనే విషయాన్ని మాత్రం ఎవరు తెలుపలేదు. ప్రస్తుతం కమలహాసన్ విక్రమ్ సినిమాతో మంచి సక్సెస్ మీద ఉన్నారు. మరి ఇ తరుణంలోనే ఇండియన్ -2 చిత్రాన్ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చాలా ఆరాటపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
మరి కమలహాసన్ ఈ సినిమాకు కోసం కొత్త నటీనటుల మరియు ఇతర నిపుణులతో మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. స్క్రిప్ట్ విషయంలో కూడా పలుమార్కులు చేయకుండా ఇండియన్-2 చేయబోతున్నట్లు సమాచారం. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం షూటింగ్లో పాల్గొనే అవకాశం లేదు కాబట్టి.. ఆమె పాత్రను పూర్తిగా తొలగించి మరొక హీరోయిన్ ని తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం. అందుకోసం బాలీవుడ్ హీరోయిన్ తో చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి కమలహాసన్ ఈ సినిమా చేయబోతున్నట్లు తెలియడంతో అతిశని ప్రేక్షకులు అభిమానుల సైతం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. హీరోయిన్ కాజల్ ఈ సినిమాలో మిస్ కావడంతో అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు. ఇక నాగార్జున ఘోస్ట్ చిత్రం నుంచి కూడా కాజల్ వెళ్లిపోవడం జరిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి