సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ రాధిక ఆప్టేను పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమాలో నటించి ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకుంది ఆ తర్వాత బాలకృష్ణ సరసన పలు సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. రాధిక ఆప్టే ఎలాంటి పని చేసిన కూడా చాలా స్పెషల్ గానే ఉంటుంది ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో మౌనిక ,ఓ మై డార్లింగ్, వంటి చిత్రాలను నటిస్తున్నది ఇప్పటికే పలు వెబ్ సిరీస్లలో నటించి తనదైన మార్కును సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా బోల్డ్ కంటెంట్లతోనే బాగా పాపులర్ అయింది.


ఇక తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో సైతం రాధిక ఆప్టే నటిస్తున్నది. రాధిక ఆప్టే వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే తానకి వివాహమైందని తన భర్త విదేశాలలో ఉంటారని అప్పుడప్పుడు కలుసుకునేందుకు వెళ్తామని దాపరికం లేకుండా తెలియజేస్తూ ఉంటుంది. ఇక వీరిద్దరి కెరియర్ పరంగా రెండు వేరువేరు దేశాల్లో నివసిస్తున్నారని ఒక ఇంటర్వ్యూలో రాధిక ఆప్టే తెలియజేసింది. అయితే తన భర్త బెనెడిక్ట్ టేలర్ తో రాధిక ఫోటో దిగడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది 2012లో వివాహం నుంచి ఒక్క ఫోటో కూడా ఇప్పటివరకు బయట ప్రపంచానికి పరిచయం చేయలేదు రాధిక ఆప్టే.ఇక తన ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఎలాంటి విషయాన్ని అయినా షేర్ చేయడానికి ఇష్టపడదు ప్రతిసారి తన పనితో ప్రేక్షకులను మాత్రమే అలరిస్తూ ఉంటుంది. తన భర్త ఫోటోలు అరుదుగా కనిపిస్తాయని అందుకు కారణం కూడా ఉందని తెలియజేసింది. రాధిక ఆప్టే మాట్లాడుతూ వాస్తవానికి తన భర్త ఫోటోలకు ఫోజులు ఇచ్చేందుకు అంతగా ఇష్టపడడు అని ఈ విషయంలో అతని ఆలోచన చాలా చెత్తగా ఉంటుంది అని తెలియజేసింది. అంతేకాకుండా 2012 వివాహానికి సంబంధించి ఒక ఫోటో కూడా తన దగ్గర లేదని గుర్తు చేసింది రాధిక ఆప్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: