టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు ఆయన సమంత గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సమంత క్రియేట్ చేసుకుంది. కేవలం కమర్షియల్ సినిమాల్లో మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి నటిగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకుంది.

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా సమంత తమిళ ఇండస్ట్రీలో కూడా అనేక సినిమాల్లో నటించి తనదైన గుర్తింపును దక్కించుకుంది. అలాగే బాలీవుడ్ లో కూడా ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ ద్వారా గుర్తింపు దక్కించుకుంది. అలాగే తాజాగా విడుదలయిన పుష్ప సినిమాలోని స్పెషల్ సాంగ్ లో తన హాట్ హాట్ అందాలను ఆరబోసే పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల మనసు దోచుకున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.

ఈ సినిమాలో సమంత 'శాకుంతల' పాత్రలో కనిపించనుంది.  దేవ్ మోహన్ దుశ్యంతుడిగా నటిస్తున్నారు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో ఎంతో భారీ వ్యయంతో అత్యున్నత సాంకేంతిక విలువలతో రూపొందుతున్న శాకుంతలం మూవీ లో కబీర్ బేడీ, మోహన్ బాబు, అదితి బాలన్, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ళ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ టీజర్ ను త్వరలోనే చిత్ర బృందం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శాకుంతలం మూవీ మేకర్స్ ఈ మూవీ టీజర్ విడుదల పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ భారీ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: