తాజాగా ‘థ్యాంక్ యు’ ప్రమోషన్ల లో భాగంగా మీడియాతో ముచ్చటించారు దర్శకుడు విక్రమ్. అయితే పనిలో పనిగా తన మరో ప్రాజెక్ట్ గురించి కూడా చిన్న హింట్ ఇచ్చేశారు ఈ డైరెక్టర్. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ మరేమిటో కాదు సూర్యతో తను తీసిన ‘24’ మూవీ సీక్వెల్. అవును ఇది నిజమే 24 సినిమాకి సీక్వెల్ తీయాలనే ఆలోచన తనకు ఉన్నట్లు చెప్పేశారు ఈ దర్శకుడు. నిజానికి 24 కథ అనుకున్న సమయం లోనే దీనికి సీక్వెల్ తీయాలని అనుకున్నాం. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొండకపోవడంతో అప్పట్లో సీక్వెల్ కి బ్రేకులు పడ్డాయి. కానీ ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలనే ఆలోచన మాత్రం నాకు ఉంది అంటూ చెప్పేశారు దర్శకుడు విక్రమ్.

ఆత్రేయ పాత్రకు సంబంధించి కథాంశాన్ని ఎక్స్‌టెండ్ చేస్తూ ‘24’ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచన తనకు ఉన్నట్లు తెలిపారు.. అయితే దాని మీద చాలా వర్క్ చేయాల్సి ఉందని చెప్పుకొచ్చారు. అనుకున్నవి అనుకున్నట్లు అన్ని కలిసి వస్తే ఫ్యూచర్ లో సూర్యతోనే ఈ సీక్వెల్ తీస్తానని కూడా ఓపెన్ అయిపోయారు. అలాగే తన కొత్త ప్రాజెక్టులు  గురించి కూడా తెలిపారు. హీరో సూర్య విభిన్న చిత్రాలకు ఎప్పుడూ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు అన్న విషయం తెలిసిందే. అందులోనూ సైన్స్ ఫిక్షన్ చిత్రాలంటే సూర్య కి పెట్టింది పేరు. అలా హీరో సూర్య కెరీర్లో నిలిచి పోయే చిత్రాల్లో 24 ఒకటి. దర్శకుడు విక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

కానీ విమర్శకులతో ప్రశంసలు అందుకుని భళా అనిపించుకుంది.  ఇండియాలో వచ్చిన బెస్ట్ సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో సూర్య మూవీ 24 కూడా ఒకటి అని నిస్సందేహంగా చెప్పొచ్చు. వినూత్న కథాంశంతో ఆద్యంతం ఉత్కంఠ బరితంగా ఆశ్చర్యం కలిగించేలా తెరకెక్కించారు విక్రమ్. ఇందులో హీరో, విలన్ పాత్రల్లో సూర్య నటన అద్భుతం అంటే అద్భుతమే. అంతేకాదు ఇందులో సూర్య ప్రతినాయకుడు పాత్రను తనే పోషిస్తూ ఆ పాత్రను పండించిన విధానం ప్రశంసనీయం. కానీ ఇందులో ఒక ముఖ్యమైన పాత్రకు విభిన్న నటుడు విజయ్ సేతుపతిని నటింప చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: