అయితే సమంత గురించి తెలిసిన వారు మాత్రం కచ్చితంగా ఆమె ఈ ఇష్యూ మీద సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతుందని అందరూ అనుకున్నారు అందులో ఇటీవలే ఒక ప్రముఖ సెలబ్రెటీ టాక్ షో కాఫీ విత్ కరణ్ షో లో సమంత పాల్గొనడం జరిగింది. దీంతో తమ విడాకుల అభిప్రాయం గురించి మాట్లాడుతుందని అందరూ అనుకున్నారు. నాగచైతన్య పేరు తీసుకురాకుండానే.. తను విడిపోయిన తర్వాత విడాకులు తీసుకున్న తర్వాత, జీవితం ఎలా ఉందో తెలియజేసింది.. ఇక కరణ్ మాట్లాడుతూ. నువ్వు నీ హస్బెండ్ విడిపోవాలని నిర్ణయించుకున్నారు ఆ తరువాత అడగగా.. సమంత మధ్యలో కలుగ చేసుకుని తను నా ఎక్స్ హస్బెండ్ అని తెలియజేసింది.
దీంతో కరణ్ సారీ చెబుతూ.. ప్రశ్నలు కంటిన్యూ చేశారు సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా ఉంచడం వల్ల మీపై ట్రోలింగ్ జరిగిందని అనుకుంటున్నారా అని అడగగా.. సమంత మాట్లాడుతూ ప్రేక్షకులు ఎల్లప్పుడూ తన జీవితంలో భాగమే కాబట్టి అందుచేతనే ఈ విషయాన్ని నేను వారి ముందు ఉంచాను అని తెలిపింది. తన జీవితం గురించి పలు విషయాలను వారికి వెల్లడించాలని తెలియజేసింది సమంత. విడాకుల తర్వాత జీవితం ఎలా ఉంది అని ప్రశ్నించేగా జీవితం చాలా కష్టంగా ఉన్నది కానీ ఇప్పుడు అంతా బాగుంది అని తెలిపింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి