సినిమా పరిశ్రమలో సక్సెస్ అనేది ఎంత ముఖ్యమైనదో ప్రతి ఒక్కరికి తెలిసిందే. సక్సెస్ ఉంటేనే ప్రతి ఒక్కరు కూడా ప్రాముఖ్యతను ఇస్తుంటారు. ముఖ్యంగా హీరోలకు సక్సెస్ ఉంటే వారికి ఎంతో ప్లస్ అవుతుంది. అలా గత కొన్ని సినిమాలుగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు చేస్తున్న బింబిసారా చిత్రంతో మళ్ళీ మంచి విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తన గత చిత్రాలకు ఎలాంటి పోలిక లేకుండా సరికొత్త జోనల్లో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందని భావిస్తున్నాడు.

వశిష్ట అనే ఓ నూతన దర్శకుడు రూపొందిస్తున్న ఈ చారిత్రాత్మక చిత్రంపై నందమూరి అభిమానులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కేథరిన్ హీరోయిన్ గా నటించగా ఇందులో బింబి సారా మహారాజుగా అలాగే ఇప్పటి తరం యువకుడిగా కళ్యాణ్ రామ్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించాడు. ఈ సినిమాను ఆగస్టు 5వ తేదీన విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇంకా పది రోజులు ఉండగానే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా మొదలుపెట్టింది చిత్ర బృందం. 

కళ్యాణ్ రామ్ తో సహా చాలామంది చిత్ర బృందం సభ్యులు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా పాల్గొంటుంది. ఆ విధంగా వారి మాటలను బట్టి వారి కళ్ళల్లో ఉన్న కాన్ఫిడెన్స్ ని బట్టి ఈ చిత్రం తప్పకుండ ప్రేక్షకులను అలరిస్తుందని చెబుతున్నారు కళ్యాణ్ రామ్ లో కూడా గతంలో ఎప్పుడు ఇంతటి కాన్ఫిడెన్స్ చూడలేదని చెబుతున్నారు. సరికొత్త కాన్సెప్ట్ తో రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా వెరైటీ కథాకథనాలతో రాబోతుంది. కాబట్టే ఈ సినిమాపై అందరూ ఇంత నమ్మకం గా ఉన్నారని తెలుస్తుంది మరి ఈ చిత్రం ఏ స్థాయిలో ఉంటుందో ఇలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలుసుకోవాలి అంటే ఈ చిత్రం విడుదల దాకా ఆగవలసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: