తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇప్పటికీ ఈయన సినిమాల వచ్చాయంటే చాలు అభిమానులలో, సినీ ప్రేక్షకులకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది. అయితే రజనీకాంత్ మాత్రం సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండాలని చెప్పవచ్చు.. ఆయన ఏదైనా సందర్భానుసారంగా మాత్రమే ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఒక ఫోటోను షేర్ చేసిన రజినీకాంత్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉన్నది. ఈ పాత ఫోటో షేర్ చేసిన రజినీకాంత్ ఫ్యాన్స్ కు విభిన్నమైన ట్రీట్ గా భావిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు చెన్నైలో చెస్ ఒలంపిక్ ఏడాది జరుగుతున్న విషయం అందరికీ తెలిసినదే.. చెస్ ఛాంపియన్స్ అందరు ఎక్కువగా ప్రస్తుతం చెన్నై వైపు చూస్తున్న నేపథ్యంలో రజనీకాంత్ తను అప్పట్లో చెస్ ఆడుతున్న సమయంలో తీసుకున్న ఒక ఫోటోను షేర్ చేశారు.


అలా ఫోటోను షేర్ చేస్తూ రజనీకాంత్ తనకు ఇష్టమైన ఇండోర్ గేమ్స్ లో అత్యంత ఇష్టమైన గేమ్ గా తెలియజేశారు. చెస్ ఒలంపియాడ్ 2002లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా తన తరఫునుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే రజనీకాంత్ షేర్ చేసిన ఈ ఫోటోకు దాదాపుగా కొన్ని లక్షల మంది రియాక్షన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రజనీకాంత్ ఇప్పుడు అప్పుడు కూడా ఒకేలాగా ఉన్నారని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.


అంతేకాకుండా ఆయన సింప్లిసిటీ ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే అంటూ కొంతమంది అభిమానులు సైతం వీటికి రిప్లై ఇస్తున్నారు ఇక రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. జైలర్ అనే సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా కొంతమేర షూటింగ్ కూడా త్వరలోనే హైదరాబాదులో జరగబోతోంది అన్నట్లుగా సమాచారం. ఇక అభిమానులు సైతం రజనీకాంత్ కి ఏదైనా సరైన విజయం అందించే సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి రజనీకాంత్ జైలర్ సినిమా తో అయినా హిట్ కొడతాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: