రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అన్ని సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ వచ్చాయి. కానీ ఎన్నో అంచనాల నడుమ కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఆచార్య సినిమా మాత్రం సాధారణ ప్రేక్షకులను మాత్రమే కాదు మెగా అభిమానులను కూడా ఎంతగానో నిరాశపరిచింది. మినిమం కూడా ఆ చిత్రం ప్రేక్షకులను అలరించలేక పోయిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా యొక్క ఫ్లాప్ ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న మెగా అభిమానులు ఈసారి చిరంజీవి చేస్తున్న సినిమా భారీ హిట్ అవ్వాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

మలయాళ మూవీ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా రూపొందుతున్న ఈ గాడ్ ఫాదర్ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరించవలసిన అవసరం ఉందని వారు చెబుతున్నారు. తమిళంలో పెద్ద సినిమాలను తెరకెక్కించి భారీ విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం.

పొలిటికల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. నయనతార ఓ కీలక పాత్రలో నటిస్తూ ఉండగా సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో మెరవడం ఈ సినిమాపై అంచనాలు విశేషంగా పెరగడానికి ప్రముఖ కారణం. వీళ్లిద్దరూ కలిసి ఒక పాటలో కూడా చిందులు వేయడం నిజంగా సినిమా పట్ల భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో మరొక కీలక పాత్రలో నటించాడు హీరో సత్యదేవ్. మరి ఇన్ని విశేషాలు కలిగిన ఈ చిత్రం దసరాకు వచ్చి ఎంతటి స్థాయిలో ప్రేక్షకులను అలరించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ సినిమా తర్వాత కూడా చిరంజీవి రెండు సినిమాలు చేస్తున్నాడు. అవి కూడా మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరించే సినిమాలు అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: