నటుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ 'ఎంత మంచి వాడవురా' మూవీ తర్వాత తాజాగా బింబిసార మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన సయుక్త మీనన్ , క్యాథరీన్  హీరోయిన్ లుగా నటించగా , ఈ మూవీ కి మల్లాడి వశిష్ట దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఆగస్ట్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ మూవీ పై సినీ ప్రేమికులు మొదటి నుండి మంచి అంచనాలు పెట్టుకోవడం, ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ మూవీ ఉండడంతో ఈ మూవీకి ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు దక్కుతున్నాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల అయిన అతి తక్కువ రోజుల్లోనే జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువగా షేర్ కలెక్షన్ లను వసూలు చేసి బాక్సా ఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 15.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకొని 16.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటి వరకు ఎనిమిది రోజుల బాక్సా ఫీస్ రన్ ని  కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 26.85 కోట్ల షేర్ , 44.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీంతో ఇప్పటి వరకు ఈ మూవీ 10.65 కోట్ల లాభాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకొని అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇప్పటికే అందుకుంది. మరి ఈ మూవీ రాబోయే రోజుల్లో ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: