నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కిన బింబిసార మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి భారీస్థాయిలోనే కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ వీకెండ్ లో కూడా బింబిసార మూవీకి బుకింగ్స్ చాలా బాగానే ఉండటంతో ఈ సినిమాకు లాభాలు అనేవి మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ వారంరిలీజ్ అయిన మూడు సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమాలలో కార్తికేయ2 సినిమాకు మాత్రమే హిట్ టాక్ వచ్చింది. నితిన్ హీరోగా ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం సినిమాకు ఫ్లాప్ టాక్ రావడం బింబిసార సినిమాకు బాగా ప్లస్ అయింది.ఇక ఈ బింబిసార మూవీ మాస్ ప్రేక్షకులకు నచ్చే మూవీ కావడం మరే మాస్ మూవీ థియేటర్లలో లేకపోవడంతో ఈ సినిమాకు చాలా ప్లస్ అవుతోంది.అయితే కార్తికేయ2 సినిమా నుంచి మాత్రమే బింబిసార సినిమాకు పోటీ ఎదురవుతోందని చెప్పవచ్చు.


సీతారామం సినిమాకు ఏ సెంటర్లలో పెద్దగా బుకింగ్స్ బాగున్నాయి. ఇంకా అలాగే మరోవైపు బింబిసార ఇప్పటికే దాదాపుగా 27 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించగా ఫుల్ రన్ లో ఈ సినిమా చాలా ఈజీగా 35 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉంది.బింబిసార సినిమా సక్సెస్ తో కళ్యాణ్ రామ్ మార్కెట్ సైతం పెరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటనకు సైతం చాలా ప్రశంసలు దక్కుతున్నాయి. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కళ్యాణ్ రామ్ చాలా అదుర్స్ అనిపించారు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం కెరీర్ విషయంలో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.బింబిసార2 ఇంకా డెవిల్ ప్రాజెక్ట్ లలో కళ్యాణ్ రామ్ నటిస్తుండగా ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: