దుల్కర్ సల్మాన్ తాజాగా సీతా రామం అనే ప్రేమకథా చిత్రంలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ కి జోడీగా మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా నటించగా, హను రాఘవపూడి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. రష్మిక మందన ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా, తరుణ్ భాస్కర్, భూమిక చావ్లా, సుమంత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

మూవీ ని ఆగస్ట్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఇప్పటి వరకు పది రోజులు బాక్స్ ఆఫీస్ రన్ ని సీతా రామం మూవీ కంప్లీట్ చేసుకుంది. ప్రేమ కథలను వెండితెరపై అద్భుతంగా తెరకెక్కిస్తాడు అని పేరు కలిగిన హను రాఘవపూడి ఈ మూవీ కి దర్శకత్వం వహించడం,  సీతా రామం మూవీ కూడా ప్రేమకథా చిత్రం కావడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.  

సీతా రామం మూవీ ప్రపంచ వ్యాప్తంగా 16.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకొని 17 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ లభించడంతో ఈ మూవీ అతి తక్కువ రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకొని సక్సెస్ ను అందుకుంది. ఈ మూవీ పది రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 24.39 కోట్ల షేర్ , 47.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దానితో పది రోజులకు గాను ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 7.39 కోట్ల లాభాలను అందుకొని సూపర్ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: