టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన కార్తీకేయ 2 సినిమా పలుమార్లు వాయిదాలు పడుతూ ఎట్టకేలకు గత శనివారం నాడు థియేటర్లలోకి వచ్చింది. ఇక తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో ఈ సినిమాకు రోజు రోజుకు థియేటర్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది.వారం తిరక్కముందే ఈ సినిమా మౌత్ టాక్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.అస్సలు ఎవ్వరూ ఊహించని విధంగా నార్త్‌లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లు కొల్లగొడుతోంది. నార్త్‌లో అటు అమీర్‌ఖాన్‌ ఇంకా అక్షయ్ కుమార్ సినిమాలు థియేటర్లలో ఉన్నా కూడా ఈ సినిమా ఆ రెండు సినిమాలను డామినేట్ చేయడం చాలా విచిత్రం. అక్కడ ట్రేడ్ వర్గాలు సైతం నిఖిల్ కార్తీకేయ 2 సినిమా వసూళ్లు చూసి షాక్ అవుతున్నాయి.శ్రీకృష్ణ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తెరపైకి వచ్చిన ఈ సినిమా కథ ఇంకా కథనాలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా ఈ సినిమాకు స్క్రీన్లు, షోల సంఖ్య కూడా పెరుగుతోంది.


ఇక మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఇంకా ఐదు రోజులకు వరల్డ్ వైడ్‌గా అదిరిపోయే వసూళ్లు సొంతం చేసుకుంది.నాలుగో రోజు మొత్తం 2. 17 కోట్లను అందుకున్న ఈ సినిమా ఐదో రోజు కూడా 1.61 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఏపీ ఇంకా తెలంగాణ చూస్తే టోటల్‌గా రు. 24 కోట్ల గ్రాస్‌..ఇంకా 15.32 కోట్ల షేర్ రాబట్టింది. ఇక కర్నాకట, రెస్టాఫ్ ఇండియాలో 1.23 కోట్లు అలాగే ఓవర్సీస్‌లో ఈ సినిమా 2.75 కోట్లు సొంతం చేసుకుంది. ఇక నార్త్‌లో హిందీ వరకు చూస్తే 2.20 కోట్లు రాబట్టింది.ఓవరాల్‌గా ఈ సినిమాకు టోటల్ గా 12.80 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా మొత్తం 13 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో రిలీజ్ అయిన కార్తీకేయ 2 ఇప్పటికే రు. 9 కోట్లకు పైగా నికరలాభంని సొంతం చేసుకుంది. ఇక రెండు రోజుల పాటు శ్రీకృష్ణాష్టమి హడావిడి ఉండడంతో ఆరో రోజు ఇంకా ఏడో రోజు కూడా మంచి వసూళ్లు రానున్నాయి. సెకండ్ వీకెండ్‌లో కూడా మంచి వసూళ్లు నమోదు చేస్తే కార్తీకేయ 2సినిమాకు దిమ్మతిరిగిపోయే లాభాలు రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: