ఇకపోతే ఇదే విషయాన్ని తెలియజేస్తూ ప్రముఖ ఓటీటీ సంస్థ Zee 5 ఒక వీడియోను కూడా షేర్ చేసింది. అయితే కన్నడ తో పాటు ఇతర భాషల్లో కూడా అందుబాటులో ఉందా లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కొమరట్టు అనే ఊరిలో ఒక పాడు పడ్డ ఇంట్లో ఒక బ్రహ్మ రాక్షసుడు ఉంటున్నాడు అనేది అక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. అయితే ఆ ఇంటి ఆవరణలో ఉన్న బావిలో ఒకరోజు ఆ ఊరి ఇన్స్పెక్టర్ శవం దొరుకుతుంది. ఇక ఆ హత్య కేసు చేదించి, నేరస్తులను పట్టుకోవడం కోసం విక్రాంత్ రోణ రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలోనే ఆ ఊరిలో అప్పటికే పదుల సంఖ్యల పిల్లల హత్యకు గురైనట్లు తెలుసుకుంటాడు. మరి వాళ్ళ మరణాలకు , పోలీస్ హత్య కు వున్న సంబంధం ఏమిటి? అంతేకాదు కేసుకు విక్రాంత్ వ్యక్తిగత జీవితానికి ఉన్న లింక్ ఏంటి? అసలు ఆ ఊర్లో ఉన్న బ్రహ్మ రాక్షసుడు ఎవడు? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.
జూలై 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లు రాబట్టి సుమారుగా నిర్మాతలకు రూ.50 కోట్ల లాభాన్ని అందించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి