టాలీవుడ్ స్టార్ హీరో జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్న సినిమా 'హరిహర వీరమల్లు'. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమవుతున్నా కూడా ఇప్పటివరకు షూటింగ్ పూర్తి కాలేదు. దీని తరువాత ఒప్పుకున్న 'వకీల్ సాబ్', 'భీమ్లానాయక్' సినిమాలు సినిమాలు రిలీజ్ కూడా అయిపోయాయి. 'హరిహర వీరమల్లు' మాత్రం ముందుకు కదలడం లేదు. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ కొత్తగా మరో రెండు సినిమాలు ఒప్పుకున్నారు. అక్టోబర్ నుంచి పొలిటికల్ యాత్రలో బిజీ అవ్వనున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరి 'హరిహర వీరమల్లు' సినిమా విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ విషయానికి వస్తే..ఇంకో యాభై శాతం షూటింగ్ పెండింగ్ లో ఉందట.
అది కూడా చాలా కీలకమైన యాక్షన్ బ్లాకులని సమాచారం. అవన్నీ చిత్రీకరించడానికి చాలా ఎక్కువ సమయమే పడుతుందట. మరి దానికి తగ్గట్లుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాల్షీట్స్ కేటాయించగలరా..? లేదా..? అనే డౌట్స్ కూడా కలుగుతున్నాయి.ఈ షూటింగ్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఎప్పుడు పూర్తవుతాయో ఎవరికీ తెలియడం లేదు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. 17వ శతాబ్దంలో మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం రూ.180 కోట్ల మేర బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత ఏఎంరత్నం తెలిపారు. మరి చెప్పిన సమయానికి సినిమా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ సినిమా షూటింగ్ మాత్రం చాలా లేట్ అవుతుంది.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి