బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కత్రినాకైఫ్ కు  ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  దాదాపు రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తన అందచందాలతో యువకుల అందరికీ కూడా పిచ్చెక్కించింది. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సీనియర్ హీరోయిన్ గా ముద్ర పడటంతో అవకాశాలు రాలేదు. కానీ ఒకప్పుడు ఏ హీరో సినిమాలో చూసిన కత్రినా కైఫ్ కనిపిస్తూ ఉండేది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలె వైవాహిక బంధం లోకి అడుగుపెట్టింది అన్న విషయం తెలిసిందే.  ఎవరికీ తెలియకుండా గుజరాత్లో తమ బంధువుల మధ్య పెళ్లి చేసుకుంది కత్రినాకైఫ్. పెళ్లి తర్వాత ఇక ఫోటోలను సోషల్ మీడియాలో బయటపెట్టడంతో అందరూ అవాక్కయ్యారు.


 కరోనా  వైరస్ కారణం గానే  ఎవరికీ చెప్పకుండా కేవలం కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంటూ కత్రినాకైఫ్ వివరణ కూడా ఇచ్చింది. ఇంతకీ ఇప్పుడు కత్రినాకైఫ్ గురించి ఎందుకు మాట్లాడు కోవాల్సి వచ్చింది అనే కదా మీ డౌట్..  కత్రినా కైఫ్ చేసిన వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కత్రినాకైఫ్ తల్లి కాబోతుంది అంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ చివరికి క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తాను గర్భవతి అన్న విషయం కేవలం గాసిప్ మాత్రమే అంటూ తెలిపింది.


 అనవసరంగా నన్ను ఎందుకు గర్భవతిని చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని నా భర్త కూడా సోషల్ మీడియాలో చూసి తెలుసుకుంటున్నారు. ఏ అమ్మాయి అయినా సరే గర్భం దాలిస్తే ఆనందపడుతుంది. కానీ  నేను మాత్రం ఈ విషయంలో బాధపడాల్సి వస్తుంది. నన్ను ఎంత మంది ఎన్ని సార్లు గర్భవతిని చేస్తారు. నట జీవితం మొదలుపెట్టిన రోజు నుంచి ఇప్పటికి ఎన్నో సార్లు గర్భవతిని చేశారు.  ఇప్పటికి చేస్తున్నారు ఇలాంటి వార్తలు రాయడం ఇప్పటికైనా ఆపండి అంటూ మీడియాతో ఆగ్రహం వ్యక్తం చేసింది కత్రినాకైఫ్.

మరింత సమాచారం తెలుసుకోండి: