టాలీవుడ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం కార్తికేయ2. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఎంతటి పెద్ద విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సినిమా మైథాలజికల్ సినిమా గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రేక్షకులందరికీ కూడా ఎంతగానో అలరిస్తూ భారీ స్థాయిలో వసూళ్లను కొల్లగొడుతుంది. చాలా రోజుల తర్వాత ఈ హీరోకి ఇంతటి స్థాయిలో సక్సెస్ వచ్చిందని చెప్పాలి.

తొలుత ఈ సినిమాను విడుదల చేస్తామో లేదో అన్న అనుమానాలను చిత్ర బృందం కూడా వ్యక్తపరిచింది. హీరో నిఖిల్ ఈ సినిమాకు సంబంధించిన విడుదల విషయంలో ఎంతగా కష్టపడ్డాడో మనందరం చూసాం. చాలాసార్లు ఈ సినిమాకు సంబంధించిన విడుదల ఆగిపోగా ఎట్టకేలకు ఈ సినిమాను విడుదల చేయగలిగారు. ఆ విధంగా ఆగస్టు 13వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరిస్తూ దేశవ్యాప్తంగా ముందుకు పోసాగుతుంది. 

నార్త్లో ఈ సినిమాకు ఎంతగానో ఆదరణ పెరిగిపోయింది అని చెప్పాలి. అక్కడ ఈ సినిమా 20 కోట్ల మార్కును అందుకోవడం నిజంగా నిఖిల్ కు మంచి సక్సెస్ అనే చెప్పాలి. తెలుగులో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్లు భావిస్తాయిలో వసూలు అవుతున్నాయి దానికి తగ్గట్లుగానే హిందీ కలెక్షన్స్ లు కూడా ఇప్పుడు పెరిగిపోయింది. ఆ చిత్రం తర్వాత విడుదలైన సినిమాలు అన్ని కూడా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించకపోవడంతో ఈ సినిమా వసుళ్లపరంగా టాకపరంగా టాప్ లో నిలిచిపోయింది. ఈ సినిమా ఇంతటి విజయాన్ని అందుకోవడంతో నిఖిల్ నటిస్తున్న తదుపరి సినిమా పై ఇప్పుడు అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి.అది కూడా పాన్ ఇండియా సినిమా గా రాబోతు ఉండడం విశేషం. స్పై అనే సినిమా ను ఈ హీరో ఇప్పటికే మొదలు పెట్టాడు. త్వరలోనే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ మొదలు కాబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: