ప్రభాస్ హీరో గా నటించిన సినిమాల దర్శకులు ఇప్పుడు తదుపరి సినిమా చేయడానికి ఎన్నో ఆపసోపాలు పడుతున్నారు. బాహుబలి సినిమా తర్వాత భారీ అంచనాల నడుమ ప్రభాస్ హీరోగా నటించిన రెండు సినిమాలు విడుదల అయ్యాయి. అయితే అవి ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించకపోవడం తో ప్రభాస్ అభిమానులు ఆ దర్శకుల పట్ల ఎన్నో విమర్శలు చేశారు. ఒక పాన్ ఇండియా హీరో తో చేయవలసిన సినిమాలు అవి కావని వారిని విమర్శించారు.
అయితే ఈ విమర్శల ప్రభావం వారి తదుపరి సినిమాలపై పడుతుందని ఎవరు కూడా ఊహించలేదని చెప్పాలి. సాహో సినిమా చేసిన దర్శకుడు సుజిత్ ఇప్పటిదాకా ఒక సినిమాని కూడా ఒప్పుకోలేదు. మెగాస్టార్ చిరంజీవి సినిమాను చేయడానికి ప్రయత్నాలు చేసిన ఆయన దానిని మధ్యలోనే వదిలేశాడు. కారణం ఏదైనా కూడా ఈ దర్శకుడు ఇప్పటిదాకా మరొక సినిమాని కనీసం మొదలుపెట్టను కూడా మొదలు పెట్టకపోవడం నిజంగా అందరిని ఎంతగానో నిరుత్సాహ పరుస్తుంది అని చెప్పాలి.
ఇక ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ చిత్రం విడుదల అయ్యి భారీ స్థాయిలో ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా ప్రభాస్ అభిమానులను కూడా మెప్పించకపోవడంతో భారీ ఫ్లాప్ గా ప్రేక్షకులు నిర్ణయించారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా రోజులు అవుతున్న కూడా ఈ సినిమా యొక్క దర్శకుడు ఇంకా తదుపరి సినిమాను ఓకే చేసుకోకపోవడం నిజంగా ఆయన అభిమానులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. ఆ విధంగా ఇద్దరు ప్రభాస్ దర్శకుల చేతిలో ఒక్క సినిమా లేకపోవడం ఎవరితో సినిమా చేస్తున్నారన్న క్లారిటీ లేకపోవడం నిజంగా ఆశ్చర్య పరుస్తుంది. మరి భవిష్యత్తులో ప్రభాస్ తో చేస్తున్న దర్శకులు ఏ విధంగా సినిమాలను చేస్తారో అనేది చూడాలి. సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్, ఆనంద్ సిద్ధార్థ్, నాగ అశ్విన్ వంటి దర్శకులతో ఆయన సినిమాలు చేస్తున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి