చాలా సంవత్సరాలుగా నయనతార రెమ్యూనరేషన్ విషయంలో టాప్ లోనే ఉన్నది. అలా ఇప్పుడు రూ 7 నుంచి రూ.8 కోట్ల రూపాయల వరకు ఒక్కో సినిమాకు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే వివాహమైన ఈ హీరోయిన్ కి సౌత్ లో ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వడం చాలా కష్టమని చెప్పవచ్చు. ఇక వివాహం తర్వాత నయనతార తను నటించే సినిమాలను నెమ్మదిగా తగ్గించుకోవాలనుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ తాను డిమాండ్ చేసిన అలాంటి రెమ్యూనరేషన్తో ముందుకు వస్తే సినిమాలలో నటించేందుకు ఓకే అంటోందట.
కమర్షియల్ సినిమాలలో ఈమె నటిస్తే సక్సెస్ అయ్యేది చాలా కష్టమని..ఇటీవల బాలకృష్ణ సినిమాలో నటించేందుకు ఈమెను సంప్రదించగా.. డైరెక్టర్ వెనక్కు తగ్గినట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలలో అది కూడా తాను డిమాండ్ కలిగిన పాత్ర ఉంటే ఏమి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈమె సినిమాల సంఖ్య తగ్గించుకోవడం కోసమే ఇలాంటి రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందని టాక్ తమిళ మీడియాలో బాగా వినిపిస్తోంది. ప్రస్తుతానికి నయనతార వైవాహిక జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక మరొకవైపు ఇతర సినిమాలకు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి