యాంకర్ అనసూయ పరిచయం అవసరం లేని పేరు. గత పది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఆంటీ అనే వివాదంతో అనసూయ బాగా వార్తలలో నిలుస్తున్నారు. ఇలా తనని ఆంటీ అని పిలుస్తూ ఏజ్ షేమింగ్ చేస్తున్నారని ఈమె పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఏకంగా తనని ఆంటీ అంటూ ట్రోల్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించింది.
ఈ క్రమంలోనే తనని విమర్శిస్తూ కామెంట్ చేసిన వారిపై ఈమె ఫిర్యాదు కూడా చేసినట్లు పేర్కొన్నారు.
ఇలా ఈమె పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పినప్పటికీ నేటిజన్స్ మాత్రం తగ్గేదేలే అంటూ తనని ఆంటీ అంటూనే ట్రోల్ చేస్తున్నారట.. ఇదిలా ఉండగా మరోసారి నేటిజెన్లు ఇదే విషయంపై అనసూయని గెలికారు.అనసూయ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఈ విషయంపై ఏమన్నారు అసలు ఏం జరుగుతుంది అంటూ నేటిజన్స్ కామెంట్లు చేయడం మొదలుపెట్టారట.. ఇకపోతే ఒక నెటిజన్ ఏకంగా నీలా మాకు పని పాట లేదా అని పోలీసులు చెప్పి పంపించి ఉంటారు అంటూ కామెంట్ కూడా చేశారు.
ఈ కామెంట్ పై స్పందించిన అనసూయ అలా అనలేదు… పని పాట లేని వారికి బుద్ధి చెప్పే సమయం వచ్చిందని చెప్పారు.. మీరు ఎంత తొందరగా నోరు జారతారో అంతే తొందరగా బోల్తాపడతారు కాస్త ఓపిక పట్టండి ప్రాసెస్ జరుగుతుంది అన్ని జరుగుతాయ్ అంటూ అనసూయ కామెంట్ చేశారట..ఇలా నేటిజెన్లకు తనదైన స్టైల్ లో మరోసారి వార్నింగ్ ఇస్తూ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ విషయంపై కొందరు స్పందిస్తూ అనసూయను ఆంటీ అన్న వారు కొన్ని వేల మంది ఉంటారు ఇంతమందిపై పోలీసులు ఎలా చర్యలు తీసుకుంటారబ్బా అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.ఏది ఏమైనా అనసూయ ఈ విషయంలో చాలా సీరియస్ గానే ఉన్నారని తప్పకుండా తనని విమర్శలు చేస్తున్న వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకునే ఆలోచనలో ఈమె ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ వివాదం ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి