మాస్ మహారాజ రవితేజ పోయిన సంవత్సరం విడుదల అయిన క్రాక్ మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.  క్రాక్ సినిమాతో పోయిన సంవత్సరం మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న రవితేజ ఈ సంవత్సరం ఇప్పటికే ఖిలాడీ , రామారావు ఆన్ డ్యూటీ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు.  ఈ రెండు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకో లేక పోయాయి.

ప్రస్తుతం రవితేజ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా , సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర , వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు. అలాగే బాబి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఒక మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇలా ఇప్పటికే మూడు మూవీ లలో హీరోగా నటిస్తూ , ఒక మూవీ లో కీలక పాత్రలో నటిస్తూ ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న రవితేజ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఒక మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కార్తీక్ ఘట్టమనేని , రవితేజ కు ఒక కథను వినిపించగా , ఆ కథ బాగా నచ్చిన రవితేజ , కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించడానికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే రవితేజ , కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్ లో తెరకెక్క బోయే మూవీ కి ఈగల్ అనే టైటిల్ ని కూడా దాదాపు కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కనిపించ బోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: