సుధీర్ బాబు హీరోగా, డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఈ చిత్రంలో యువ హీరోయిన్ కృతి శెట్టి నటించినది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మించడం జరిగింది. ఈ చిత్రం ఈనెల 16వ తేదీన విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోతోంది మొదటి రోజు ఈ సినిమా పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ వీకెండ్ వచ్చేసరికి ఈ సినిమా ఎంతటి కలెక్షన్లను రాబట్టిందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.


1). నైజాం -20 లక్షలు.
2). సీడెడ్-5 లక్షలు.
3). ఉత్తరాంధ్ర-10 లక్షలు.
4). ఈస్ట్-5 లక్షలు.
5). వెస్ట్-4 లక్షలు.
6). గుంటూరు-5 లక్షలు
7). కృష్ణ-4 లక్షలు
8). నెల్లూరు-4 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొదటివారం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.57 లక్షల రూపాయలను రాబట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా-5 లక్షలు.
11). ఓవర్సీస్-15 లక్షలు.
12). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే రూ.77 లక్షల రూపాయలను మాత్రమే రాబట్టింది.


ఇక ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే చిత్రం థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.7.74 కోట్ల రూపాయలు బిజినెస్ జరగగా ఈ సినిమా సక్సెస్ కావాలి అంటే రూ.8 కోట్ల రూపాయలు షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది.. అయితే ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి రూ.77 లక్షల రూపాయలను మాత్రమే రాబట్టింది. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే ఇంకా రూ.7.23 కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉన్నది. మరి ఈ సినిమా అంతటి కలెక్షన్లను రాబడుతుందా లేదా అనే విషయం తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.. ఒకవేళ ఈ సినిమా రాబట్ట లేకపోతే కృతి శెట్టి కెరియర్లు హ్యాట్రిక్ ఫ్లాపులు చవిచూసినట్లే అని పలువురు నెటిజన్ల సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇక సుధీర్ బాబు ఖాతాలో మరొక ఫ్లాప్ పడినట్లే నని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: