రాఘవ లారెన్స్ గు రించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాన్స్ కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలు పెట్టి అంచలంచలుగా ఎదిగారు లారెన్స్.
కొరియోగ్రాఫర్‌గా నటుడిగా దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థాయిని క్రియేట్ చేసుకున్నారు రాఘవ లారెన్స్.ఇక లారెన్స్ హారర్ లకు పెట్టింది పేరుగా మారిపోయారు. ముని నుంచి మొదలు పెట్టి కాంచన 3 వరకు హారర్ లను డైరెక్ట్ చేసి సూపర్ హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం హీరోగా పలు ల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే లారెన్స్ సేవ గుణం గురించి అందరికీ తెలిసిందే. ఎంతో మందికి లారెన్స్ అండగా నిలిచారు. కష్టం వచ్చింది అని ఆయన దగ్గరకు వెళ్తే తనకు చేతనంత వరకు సాయం చేసి వారిని ఆదుకుంటూ ఉంటారు లారెన్స్.

తాజాగా లారెన్స్ చేసిన పని నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక పై తాను ఎవరికి సాయం చేసినా వారి కళ్ళకు దండం పెడతా అంటూ ఓ పోస్ట్‌ను షేర్ చేశారు లారెన్స్.. 'నా జీవితంలో ఇది ఒక మార్పు. ఇక నుంచి నేను ఎవరికి సహాయం చేసినా.. వాళ్లు నా పాదాల పై పడకూడదని భావిస్తాను. నేనే వారి పాదాలపై పడి సేవ చేస్తాను' అంటూ ఓ చిన్నారి పాదాల కు నమస్కరిస్తున్న ఫోటోను షేర్ చేశారు లారెన్స్. అలాగే ..నాలో ఈ చిన్న మార్పు తీసుకురావాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. దానికి ఈ రోజు నుంచే తొలి అడుగు వేస్తున్నాను. ఇప్పటి వరకు ధనవంతుల కాళ్లపై పడి పేదలు సాయం అడగడం చూశారు. ఇక నుంచి నేను ఇలాంటివి చూడాలని అనుకోవట్లేదు. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలే ఇందుకు కారణం. నేను వాటిని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను అంటూ రాసుకొచ్చారు లారెన్స్. లారెన్స్ నిర్ణయం పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: