మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే ఈ సంవత్సరం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ గా తన పాపులారిటీని పెంచుకున్నాడు. ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరోగా నటించాడు. ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్న రామ్ చరణ్ కొన్ని రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఇలా ఇప్పటికే రెండు సినిమాలతో ఈ సంవత్సరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రేక్షకులను అలరించాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి చిత్ర బృందం ఇప్పటివరకు టైటిల్ ని కన్ఫామ్ చేయకపోవడంతో ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా తెరకెక్కుతుండడంతో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఈ మూవీ లోకి కీయార అద్వానీ , రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే తమన్మూవీ కి సంబంధించిన రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ కంపోజిషన్ ని కంప్లీట్ చేసినట్లు ,  ఆ సాంగ్ అదిరిపోయే రేంజ్ లో వచ్చినట్లు ,  సినిమా ఆల్బమ్ లోనే ఈ సాంగ్ సూపర్ గా ఉండబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: