మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య నే "ఆచార్య" సినిమా తో మర్చిపోలేని డిజాస్టర్ అందు కున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమా లో ముఖ్య పాత్ర లో కనిపిం చారు.
ప్రమో షన్స్ లో భాగం గా మాట్లాడు తూ సినిమా గురించి బోలెడు కబుర్లు చెప్పారు మెగా హీరోలు. కానీ సినిమా మాత్రం విడుదలైన మొదటి రోజు నుంచి ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది. భారీ అంచనాల మధ్య ఆ విడుదలై  నప్పటి కీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. ఈ సినిమా విషయం లో చిరంజీవి మరియు రామ్ చరణ్ తీవ్రంగా నిరాశ చెందు  తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఆచార్య సినిమా అలా అవటం వల్ల చిరంజీవి తన తదుపరి సినిమా "గాడ్ ఫాదర్" ప్రమోషన్స్ పై అంత గా దృష్టి పెట్టడం లేదు. ముఖ్యం గా రామ్ చరణ్ సినిమా ప్రమో షన్స్ లో పాలు పంచు కోవట్లేదు. దానికి కారణం ఆచార్య సినిమా గురించి తర్వాత నుంచి రామ్ చరణ్ మీడియా కి దూరం గా ఉండటం. ఆచార్య సినిమా సమయం  లో బోలెడు కామెంట్లు చేసిన రామ్ చరణ్ సినిమా సక్సెస్ అవ్వకపోవడం  తో షాక్ అయ్యారు.

అప్పటినుంచి మీడియా ముందు కి రావడం కూడా మానేశారు. ఒకవేళ ఆచార్య సినిమా గురించి అడిగితే ఏమని చెప్పా లో తెలియక రామ్ చరణ్ మీడియా ని అవాయిడ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే "గాడ్ ఫాదర్" ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ హోస్ట్ గా చిరంజీవి మరియు డైరెక్టర్ మోహన్ రాజాలు గెస్ట్లుగా ఒక ఇంటర్వ్యూ ను ప్లాన్ చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువ డాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: