ఆరెక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కాలికి దెబ్బ తగిలింది. టాలీవుడ్ హాట్ బ్యూటీ కాలికి ఎలా తగిలిందో ఎప్పుడు తగిలిందో తెలియదు కానీ ఆమె తన సోషల్ మీడియాలో తనకు దెబ్బ తగిలిన విషయాన్ని చెప్పుకొచ్చింది. ఆరెక్స్ 100 సినిమాతో యూత్ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న పాయల్ ఆ తర్వాత అదే తరహా సినిమాల్లో చేస్తూ వచ్చింది. విక్టరీ వెంకటేష్ తో జోడీ కట్టినా సరే అమ్మడికి లక్ కలిసి రాలేదు.

ఇక యువ హీరోలతో జోడీ కడుతూ కెరియర్ వెళ్లదీస్తున్న పాయల్ ప్రస్తుతం ఆరెక్స్ 100 లాంటి సినిమాలు వచ్చినా చేయాలని ఆసక్తి చూపిస్తుంది. ఈమధ్యనే ఆది సాయి కుమార్ తో తీస్ మార్ ఖాన్ సినిమా చేసిన పాయల్ మంచు విష్ణు హీరోగా వస్తున్న జిన్నా సినిమాలో కూడా నటించింది. ఈ సినిమాలో పాయల్ అందాలకి బాగానే పని చెప్పినట్టు ఉంది. విష్ణు సినిమాలో పాయల్ నే హైలెట్ చేస్తూ వస్తున్నారు.

మంచు విష్ణు జిన్నా సినిమాలో పాయల్ తో పాటుగా సన్నీ లియోన్ కూడా నటించింది. ఈ ఇద్దరి హాట్ హాట్ అందాలతో సినిమాకు స్పెషల్ క్రేజ్ తెచ్చుకునే పనిలో ఉన్నాడు విష్ణు బాబు. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే తన సోషల్ మీడియా ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కోసం ఫోటో షూట్స్ చేస్తుంది పాయల్. అమ్మడికి గాయమైందని తెలియగానే బేబీ ఏమైందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. ఎక్కడో బాలీవుడ్ సీరియల్స్ నుంచి వచ్చి తెలుగులో బాగానే సెటిల్ అయ్యింది పాయల్ రాజ్ పుత్. అయితే కెరియర్ డల్ గా ఉన్న ఈ టైం లో మరో సూపర్ హిట్ పడితే మళ్లీ అమ్మడు తిరిగి ఫాం లోకి వస్తుంది. అప్పటిదాకా వచ్చిన ప్రతి అవకాశాన్ని చేసుకుంటూ వెళ్తుంది పాయల్ రాజ్ పుత్.


మరింత సమాచారం తెలుసుకోండి: