టాలీవుడ్ లో రాజమౌళి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ కుటుంబం నుంచి హీరోగా సినిమా వస్తుందంటే చాలు భారీ అంచనాలు ఉంటాయి అయితే ఈ సినిమా చిన్న హీరో అయినా సరే చిన్న బడ్జెట్ చిత్రమైన సరే రాజమౌళి పేరుతో వస్తుందంటే ఆ సినిమాకు మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే తాజా కీరవాణి తనయుడు శ్రీ సింహా నటించిన "దొంగలున్నారు జాగ్రత్త" సినిమాకు మాత్రం అంత బజ్ రాలేదని చెప్పవచ్చు.. రాజమౌళి ఫ్యామిలీకి చెందినవారు ఎవరు కూడా ఈ సినిమా గురించి పెద్దగా ఎక్కడ స్పందించకపోవడం జరుగుతోంది. దొంగలున్నారు జాగ్రత్త చిత్రం నిన్నటి రోజు ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా విడుదల అయిందా అనే సంగతి కూడా ఎవరికి తెలియదు.


దీంతో ఈ చిత్రం ఎంత సైలెంట్ గా విడుదల అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా యొక్క ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా అసలు ఎక్కడ జరపలేదు. దాంతో ఈ సినిమా మొదటి రోజు చాలా డల్ ఓపెనింగ్స్ రాబట్టుకున్నట్లు సమాచారం. విడుదల అయ్యింది తక్కువ థియేటర్లో పైగా ప్రమోషన్స్ లేకపోవడంతో పలుచోట్ల షోలు కూడా క్యాన్సిల్ చేయవలసిన పరిస్థితి వచ్చిందంటే.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రాజమౌళి కుటుంబం నుంచి హీరో సినిమాకు ఇలాంటి పరిస్థితి ఏంటో అర్థం కావడంలేదని పలువురు మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోతున్నారు.


అయితే రాజమౌళి కాకుండా కనీసం కీరవాణి కుటుంబ సభ్యులైన సరే ఈ సినిమా ప్రమోషన్స్ని చేయలేదు. దీంతో ఈ చిత్రం చాలా సైలెంట్ గా విడుదలయ్యింది. ఈ చిత్రం ఎక్కువగా హాలీవుడ్లో కనిపించే సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కించడం జరిగింది. మొదట ఈ సినిమాకి ఓటీటి ఆఫర్ వచ్చిందట. అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమాని ఓటీటీ లో కాకుండా థియేటర్లలో విడుదల చేశారు. మరి ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: